ETV Bharat / bharat

Mamata On Chandrababu Arrest : 'తప్పు జరిగితే విచారణ చేయండి.. కానీ ప్రతీకారం పనికి రాదు!'.. చంద్రబాబు అరెస్ట్​పై మమత కామెంట్స్​ - మమతా బెనర్జీ చంద్రబాబు అరెస్ట్​

Mamata On Chandrababu Arrest : టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్​పై బంగాల్​ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పందించారు. చంద్రబాబు అరెస్ట్​ కక్షసాధింపులా కనిపిస్తోందని వ్యాఖ్యానించారు

Mamata On Chandrababu Arrest
Mamata On Chandrababu Arrest
author img

By ETV Bharat Telugu Team

Published : Sep 11, 2023, 5:04 PM IST

Updated : Sep 11, 2023, 5:58 PM IST

Mamata On Chandrababu Arrest : తెలుగుదేశం పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్​ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్ట్​ను బంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తప్పుపట్టారు. చంద్రబాబు అరెస్టు కక్ష సాధింపులా కనిపిస్తోందని ఆమె పేర్కొన్నారు. ఏదైనా తప్పు జరిగితే విచారణ జరపాలన్న దీదీ.. కక్షసాధింపు ధోరణి సరికాదని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో ఇది బూమ్‌రాంగ్ అవుతుందని తెలిపారు.

  • #WATCH | On the arrest and judicial custody of former Andhra Pradesh CM and TDP Chief N Chandrababu Naidu, West Bengal CM Mamata Banerjee says, " I don't like the arrest of Chandrababu Naidu, if there is some mistake, you should talk and conduct an investigation. Nothing should… pic.twitter.com/wnIeBNAzCb

    — ANI (@ANI) September 11, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

"ఇది రాజకీయ కక్షసాధింపు. ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ ఇలా చేస్తే రేపు మరో పార్టీ అధికారంలోకి వస్తుంది. వారు కూడా అలాగే చేస్తారు. ఇలా చేయడం సరికాదని నా భావన. మేం ఎప్పుడూ ఇలా చేయలేదు. బంగాల్‌లో సీపీఎం 34 ఏళ్లపాటు అధికారంలో ఉంది. వారి ముఖ్యమంత్రి, హోంమంత్రుల గురించి మా వద్ద చాలా సమాచారం ఉంది. కానీ మేం వారిని ఎలాంటి ఇబ్బందులకు గురి చేయలేదు. చంద్రబాబునాయుడిని అరెస్టు చేశారు. నేను దానిని సమర్థించలేదు. ఏదైనా తప్పు జరిగితే మాట్లాడండి, తనిఖీలు చేయండి, విచారణ జరపండి. అధికారం మీ చేతిలో ఉంది. కానీ కక్షసాధింపు ధోరణిలో వ్యవహరించడం సరికాదు. రాబోయే కాలంలో ఇది బూమ్‌రాంగ్ అవుతుంది."

--మమతా బెనర్జీ, బంగాల్​ ముఖ్యమంత్రి

'అభిషేక్‌ బెనర్జీని కూడా కేంద్రం వేధిస్తోంది'
Mamata On Central Government : ఐదేళ్ల తర్వాత విదేశీ పర్యటకు వెళ్తున్న సందర్భంగా.. పలు అంశాలపై దీదీ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ తీరుపై విరుచుకుపడ్డారు. "ఐదేళ్ల తర్వాత విదేశాలకు వెళ్తున్నాను. విదేశాల నుంచి ఇదివరకు ఎన్నో ఆహ్వానాలు వచ్చినప్పటికీ ఇక్కడ అనుమతి ఇవ్వలేదు. దిల్లీ పోలీసులు మాకు శత్రువులు కాదు. కానీ, రాజకీయంగా ఆందోళనలకు పిలుపునిచ్చినందున అక్కడకు వెళ్లేందుకు అనుమతి లేదు. అయినప్పటికీ రాజ్‌ఘాట్‌కు వెళ్లి నివాళి అర్పిస్తాం. బంగాల్‌లో అభిషేక్‌ బెనర్జీని కూడా కేంద్ర ప్రభుత్వం ఇలాగే వేధిస్తోంది. ఓ యువ నాయకుడిని అణచివేసేందుకు కేంద్రం ఈ తరహా చర్యలకు దిగుతోంది" అని మమతా బెనర్జీ ఆరోపించారు.

  • VIDEO | "If permission is not given to us (TMC) for the protest, then we will go to Rajghat to pray," says West Bengal CM @MamataOfficial on a protest called by her party on October 2 seeking clearance of funds by the Centre for the state. pic.twitter.com/It6XWAvsHO

    — Press Trust of India (@PTI_News) September 11, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

దిల్లీ టీఎంసీ ఆందోళనలు..
TMC Protest : బంగాల్‌కు ఎన్‌ఆర్‌ఈజీఏ నిధులను మంజూరు చేయకపోవడాన్ని నిరసిస్తూ దిల్లీలో ఆందోళన చేపట్టేందుకు తృణమూల్‌ కాంగ్రెస్‌ సిద్ధమైంది. దిల్లీలోని రాజ్‌ఘాట్‌తో సహా మూడుచోట్ల అక్టోబర్‌ 2న ఆందోళనలు చేపట్టాలని ప్రయత్నిస్తోంది. మరోవైపు, విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకుగాను ముఖ్యమంత్రి మమత.. దుబాయ్‌, స్పెయిన్‌లలో పర్యటించనున్నారు. మంగళవారం ఆమె విదేశీ ప్రయాణం మొదలుకానుంది.

'సాయం కోరుతూ అమిత్ షాకు మమత ఫోన్​!'.. రాజీనామా చేస్తానని దీదీ సవాల్

'EVMలను బీజేపీ హ్యాక్ చేస్తోంది.. మా వద్ద ఆధారాలున్నాయ్'.. మమత సంచలన ఆరోపణలు

Last Updated : Sep 11, 2023, 5:58 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.