ETV Bharat / bharat

అగ్నితో ఆటలొద్దు: సీఎంకు గవర్నర్​ వార్నింగ్

బంగాల్​ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు ఆ రాష్ట్ర గవర్నర్​ జగ్​దీప్​ ధనకర్​. భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కాన్వాయ్​పై రాళ్ల దాడి ఘటనపై ఆమె చేసిన వ్యాఖ్యలను ఖండించారు. అగ్నితో ఆటలొద్దని మమతా బెనర్జీని హెచ్చరించారు.

Mamata Banerjee should appologise for yesterday's comments ; WB Governor Jagdeep Dhankar
'మమతా దీదీ.. అగ్నితో ఆటలొద్దు'
author img

By

Published : Dec 11, 2020, 2:14 PM IST

భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కాన్వాయ్​పై రాళ్ల దాడి నేపథ్యంలో బంగాల్​ ముఖ్యమంత్రిపై విరుచుకుపడ్డారు ఆ రాష్ట్ర గవర్నర్ జగ్​దీప్​​ ధనకర్​. ఘటనపై మమత చేసిన వ్యాఖ్యలకు ఆమె క్షమాపణలు చెప్పాలని డిమాండ్​ చేశారు. ఇలాంటి ఘటనలు ప్రజాస్వామ్యానికే మచ్చగా మిగిలిపోతాయని పేర్కొన్నారు.

"నిన్న జరిగిన ఘటన ఎంతో దురదృష్టకరం. అవి ప్రజాస్వామ్యానికే మచ్చ. మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలకు ఆమె వెంటనే క్షమాపణలు చెప్పాలి. ఆమె అగ్నితో ఆటలు ఆడకూడదు."

---- జగ్​దీప్​​ ధనకర్​, బంగాల్​ గవర్నర్​.

భాజపా ర్యాలీల్లో ప్రజలు లేరని, ఆ విషయాన్ని పక్కదోవ పట్టించేందుకే నడ్డా కాన్వాయ్​పై దాడి చేయించారని ఆరోపించారు మమత. ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఈ విధంగా ఎలా మాట్లాడతారని మండిపడ్డారు ధనకర్​.

రాష్ట్రంలో శాంతిభధ్రతలు పూర్తిగా దెబ్బతిన్నాయని.. ఈ విషయంపై కేంద్ర హోంశాఖకు లేఖ రాశానని వెల్లడించారు ధనకర్​. చట్టాన్ని ఉల్లంఘించే వారికి బంగాల్​ పోలీసులు, యంత్రాంగం రక్షణ కల్పిస్తున్నాయని ఆరోపించారు.

ఇదీ చూడండి:- బంగాల్​ సీఎస్​, డీజీపీకి హోంశాఖ సమన్లు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.