Mamata Banerjee plane accident: విమాన ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్న ఘటనపై బంగాల్ సీఎం మమతా బెనర్జీ స్పందించారు. తన ఎయిర్‌క్రాఫ్ట్‌ను మరో విమానం ఢీకొట్టే ప్రమాదం నుంచి తప్పించుకున్నట్లు పేర్కొన్నారు. 8 వేల అడుగులో ఎయిర్‌క్రాఫ్ట్‌లో ప్రయాణిస్తున్న సమయంలో అకస్మాత్తుగా మరో విమానం తమ ఎయిర్‌క్రాఫ్ట్ వైపు వచ్చిందని మమత పేర్కొన్నారు.
పైలట్ చాకచక్యం వల్ల పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకున్నట్లు మమత వెల్లడించారు. ఈ ఘటనలో స్వల్పంగా గాయపడినట్లు మమత తెలిపారు. విమానం గురించి ఏటీసీ, డీజీసీఏ నుంచి ఎలాంటి సమాచారం లేదన్నారు.
ఏం జరిగింది?
Mamata Banerjee plane crash: గత శుక్రవారం ఉత్తర్‌ప్రదేశ్‌లో సమాజ్‌వాదీ పార్టీ తరఫున ప్రచారానికి వెళ్లిన మమత.. ఆరోజు సాయంత్రం వారణాసి నుంచి ప్రత్యేక విమానంలో తిరుగుపయనమయ్యారు. అయితే, మధ్యలో విమానం భారీ కుదుపులకు గురైంది. పైలట్ చాకచక్యంతో విమానం కోల్‌కతాలోని అంతర్జాతీయ విమానాశ్రయానికి సురక్షితంగా చేరుకున్నప్పటికీ ఆమె వెన్నునొప్పికి గురైనట్లు అధికార వర్గాలు తెలిపాయి.
'దసో ఫాల్కాన్ 2000' అనే విమానంలో మమత ప్రయాణించారు. 10.3 టన్నుల బరువుండే ఈ తేలికపాటి విమానంలో ఇద్దరు సిబ్బంది సహా గరిష్ఠంగా 19 మంది ప్రయాణించొచ్చు.
ఇదీ చదవండి: యూపీలో భాజపా, పంజాబ్‌లో ఆప్.. ఎగ్జిట్ పోల్స్ అంచనాలివే...