తమిళనాడు కృష్ణగిరి జిల్లాలో.. వేగంగా వెళుతున్న ట్రక్.. ఏనుగును ఢీకొట్టింది. దాంతో ఏనుగు కాళ్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఇప్పుడా ఏనుగు కదలలేని స్థితిలో విలవిలలాడుతోంది. బారండపల్లి వద్ద హోసూర్ జాతీయ రహదారిని 40ఏళ్ల మగ ఏనుగు దాటుతుండగా ఈ ఘటన జరిగింది.
సమాచారం అందుకున్న హోసూర్ అటవీ శాఖ అధికారులు..ఘటనా స్థలానికి చేరుకుని ఏనుగుకు అత్యవసర చికిత్స అందించారు. అయినప్పటికీ ఆ ఏనుగు కాళ్లను కదపలేకపోతోంది. తొడకు తీవ్రమైన గాయం అయినట్టు గుర్తించిన అధికారులు తగిన చికిత్స అందిస్తున్నారు. వన్య ప్రాణుల సంరక్షణ చట్టం కింద ట్రక్ డ్రైవర్‌పై కేసు నమోదు చేశారు. ప్రమాదానికి కారణమైన ట్రక్‌ను సీజ్ చేశారు.
తరచుగా ఇక్కడి రహదారి ప్రాంతంలో ప్రమాదాలు జరుగుతుంటాయి. ప్రమాద హెచ్చరిక సూచికలను కూడ ఇదివరకే అక్కడ ఏర్పాటు చేశారు. అయినా కూడా ట్రక్‌ను డ్రైవర్ వేగంగా నడిపి ప్రమాదానికి కారణమయ్యాడు.
ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఆ ప్రాంతంలో సౌరదీపాల్ని ఏర్పాటు చేయాలని అటవీ హక్కుల కార్యకర్తలు సూచిస్తున్నారు.
ఇదీ చూడండి: జల్లికట్టు వేడుకలో అపశ్రుతి- ఇద్దరు మృతి