ETV Bharat / bharat

67 Year Old Man Won 3 Medals : 67ఏళ్ల వయసులో భళా.. రన్నింగ్​ రేస్​లో మూడు పతకాలు.. మలేసియా మాస్టర్స్​లో..

67 Year Old Man Won 3 Medals : 67 ఏళ్ల వయసులో 50 కిలోమీటర్ల రన్నింగ్ రేస్​లో పాల్గొంటూ అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నారు ఓ మాజీ సైనికుడు. హిమాచల్​ ప్రదేశ్​కు చెందిన సురేంద్ర సింగ్.. మలేసియాలో జరిగిన ఓపెన్​ మాస్టర్ అథ్లెటిక్స్​ మీట్​లో మరో మూడు పతకాలు సాధించారు. ఇప్పటికే అనేక అవార్డులను ఆయన సొంతం చేసుకున్నారు.

67 year old man won 3 medals
67 year old man won 3 medals
author img

By ETV Bharat Telugu Team

Published : Sep 29, 2023, 10:47 AM IST

Updated : Sep 29, 2023, 11:01 AM IST

67 ఏళ్ల వయసులో రన్నింగ్​లో అదరగొడుతున్న మాజీ సైనికుడు

67 Year Old Man Won 3 Medals : సాధించడానికి వయసు అడ్డంకి కాదని నిరూపిస్తున్నారు ఓ రిటైర్డ్​ సైనికుడు. 67 ఏళ్ల వయసులో యువకుడిలా పరుగెడుతూ.. అనేక పతకాలు సాధిస్తున్నారు హిమాచల్​ ప్రదేశ్​కు చెందిన సురేంద్ర సింగ్​. ఇప్పటికే పలు అవార్డులు గెలుచుకున్న సురేంద్ర.. తాజాగా మలేసియా ఓపెన్​ మాస్టర్ అథ్లెటిక్స్​ మీట్​లో మరో మూడు పతకాలు సాధించారు. 5 నుంచి 50 కిలోమీటర్ల రన్నింగ్ రేసుల్లో పాల్గొంటూ అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నారు.

హమీర్​పుర్​కు చెందిన సురేంద్ర సింగ్​.. ఇప్పటివరకు ఏడు సార్లు నేషనల్​ ఓపెన్​ మాస్టర్స్​ పోటీల్లో పాల్గొన్నారు. ఇందులో 8 బంగారు, మూడు రజత పతకాలు గెలుచుకున్నారు. తాజాగా సెప్టెంబర్​ 16,17 తేదీల్లో జరిగిన మలేసియా ఓపెన్ మాస్టర్​ అథ్లెటిక్స్ మీట్​లో పాల్గొని.. రెండు రజత, ఒక కాంస్య పతకాన్ని సొంతం చేసుకున్నారు. 800, 1500 మీటర్ల రన్నింగ్ రేస్​లో రజతాలు సాధించగా.. 3000 మీటర్ల పరుగు పందెంలో ఓ కాంస్యాన్ని గెలుచుకున్నారు. థాయిలాండ్​లో జరిగిన 1500 మీటర్ల పరుగు పందెంలో పాల్గొని రెండు రజత, ఓ కాంస్య పతకాన్ని సొంతం చేసుకున్నారు. వీటితో పాటు చెన్నై, బెంగళూరు, కోల్​కతా, గుజరాత్​, పటియాలా, మణిపుర్​లో జరిగిన అనేక రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొని పతకాలు గెలుచుకున్నారు సురేంద్ర. 17ఏళ్ల పాటు ఆర్మీలో పనిచేసిన సురేంద్ర సింగ్​... తన శరీరాన్ని ఎప్పుడూ ఫిట్​గా ఉండేందుకు ప్రయత్నిస్తారు. రోజు ఉదయం, సాయంత్రం వ్యాయామం, రన్నింగ్ చేస్తూ యాక్టివ్​గా ఉంటారు. కొవిడ్ లాంటి విపత్కర పరిస్థితుల్లోనూ రన్నింగ్​ ప్రాక్టీస్ చేశారు.

Runner Surender Singh
పతకాలతో సురేంద్ర సింగ్​

"45 ఏళ్ల వయసులో సరదాగా రన్నింగ్ చేయడం ప్రారంభించాను. ఆ తర్వాత క్రమంగా ఆసక్తి పెరగడం వల్ల జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో పాల్గొన్నాను. ఇప్పటికే అనేక పతకాలు సాధించాను. త్వరలో యూరప్​లో జరిగే ఇంటర్​నేషనల్​ మాస్టర్స్​ అథ్లెటిక్స్​ పోటీల్లో స్వర్ణం గెలుచుకోవడమే నా లక్ష్యం."

--సురేంద్ర సింగ్​, మాజీ సైనికుడు

సురేంద్ర సాధించిన విజయాల పట్ల ఆయన భార్య మీరా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. విదేశాలకు వెళ్లినప్పుడు ఫోన్​ చేసి ఆయనను ఉత్సాహపరుస్తామని చెప్పారు. 67 ఏళ్ల వయసులో కూడా ఫిట్​గా ఉంటూ.. భారత్​కు పతకాలు తీసుకురావడం ఆశ్చర్యంగా ఉందని స్థానికులు అంటున్నారు. యువత డ్రగ్స్​కు బానిసలు కాకుండా.. ఆటల పట్ల ఆసక్తి కనబరచాలని సూచిస్తున్నారు సురేంద్ర.

రన్నింగ్​ రేస్​లో అదరగొట్టిన 80 ఏళ్ల బామ్మ

82 ఏళ్ల బామ్మ తగ్గేదేలే.. ఈత పోటీల్లో గోల్డ్ మెడల్.. వందల మందితో పోటీ పడి..

Last Updated : Sep 29, 2023, 11:01 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.