ETV Bharat / bharat

నటుడు సురేశ్​గోపీ సోదరుడు అరెస్ట్​..! - సునీల్​ గోపీ అరెస్ట్

Suresh Gopi's brother arrested: ప్రముఖ మలయాళ నటుడు సురేశ్​ గోపీ సోదరుడు సునీల్​ గోపీని పోలీసులు అరెస్ట్ చేశారు. భూకుంభకోణానికి సంబంధించిన ఆరోపణల నేపథ్యంలో ఆయనను అరెస్ట్​ చేశారు.

సురేశ్​గోపీ సోదరుడు అరెస్ట్
Sunil Gopi got arrested
author img

By

Published : Mar 21, 2022, 9:14 AM IST

Updated : Mar 21, 2022, 9:35 AM IST

Suresh Gopi's brother arrested: కేరళ చలనచిత్ర పరిశ్రమలో ప్రముఖ నటుడు అయిన సురేశ్​ గోపీ సోదరుడు సునీల్​ గోపీని పోలీసులు అరెస్ట్​ చేశారు. కోయంబత్తూరు​లోని ఓ భూకుంభకోణానికి సంబంధించిన ఆరోపణలతో ఆయన్ను కస్టడీలోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. కోర్టు పరిధిలో ఉన్న భూమిని విక్రయించడంతో సునీల్ గోపీని కోయంబత్తూరు క్రైం బ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. కోయంబత్తూరులోని జీఎన్‌ మిల్స్‌ నివాసి గిరిధరన్‌ కోయంబత్తూరు జిల్లా క్రైమ్‌ బ్రాంచ్‌లో ఫిర్యాదు చేశారు.

ఇదీ జరిగింది..

కోయంబత్తూరులోని నవకరై ప్రాంతంలో మయిల్ సామికి చెందిన 4.52 ఎకరాల భూమిని సునీల్ గోపి కొనుగోలు చేశారు. ఆ స్థలానికి సంబంధించి కోర్టు బాండ్ రిజిస్ట్రేషన్ చెల్లదని తీర్పు చెప్పింది. అయినా కానీ సునీల్ కోర్టు ఇచ్చిన తీర్పును అతిక్రమించి.. కోయంబత్తూరులోని జిఎన్ మిల్స్ ప్రాంతానికి చెందిన గిరిధరన్‌కు దానిని విక్రయించాడు. ఇందుకుగాను గిరిధరన్ వివిధ బ్యాంకు ఖాతాల నుంచి అడ్వాన్స్‌గా రూ.97 లక్షలు చెల్లించాడు.

Sunil Gopi
సునీల్​ గోపీ

భూమికి సంబంధించిన డాక్యుమెంట్లను పరిశీలించగా.. అది వేరొకరి పేరు మీద ఉందని తేలింది. దీనిపై గిరిధరన్.. సునీల్‌ను సంప్రదించేందుకు ప్రయత్నించారు. కానీ అతని నుంచి సరైన స్పందన రాకపోవడం వల్ల పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సునీల్​ గోపీతో పాటు మరో ఇద్దరి మీద కూడా పోలీసులు కేసు నమోదు చేశారు.

ఇదీ చూడండి: ఎమర్జెన్సీలో నాన్నే నన్ను పోలీసులకు అప్పగించారు: సీఎం స్టాలిన్‌

Last Updated : Mar 21, 2022, 9:35 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.