ETV Bharat / bharat

'పరువు నష్టం కలిగేలా ప్రశ్నలు- వస్త్రాపహరణ చేశారు' ఎంపీ మహువా​ సంచలన ఆరోపణలు

Mahua Moitra Latest News : సొమ్ములు స్వీకరించి పార్లమెంటులో ప్రశ్నలు అడిగారనే ఆరోపణల్ని ఎదుర్కొంటున్న టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా.. ఎథిక్స్‌ కమిటీ ఛైర్‌పర్సన్‌ వినోద్‌ కుమార్‌పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. వస్త్రాపహరణ చేశారంటూ ఆరోపించారు. ఈ మేరకు ఆమె లోక్​సభ స్పీకర్​కు లేఖ రాశారు.

author img

By ETV Bharat Telugu Team

Published : Nov 3, 2023, 6:50 AM IST

Updated : Nov 3, 2023, 7:07 AM IST

mahua moitra latest news
mahua moitra latest news

Mahua Moitra Latest News : పార్లమెంటులో ప్రశ్నలు అడిగేందుకు డబ్బులు తీసుకున్నారంటూ తనపై వచ్చిన ఆరోపణల కేసులో ఎథిక్స్‌ కమిటీ ఛైర్‌పర్సన్‌ వినోద్‌ కుమార్‌ వస్త్రాపహరణ చేశారంటూ టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా ఆరోపించారు. ఈ మేరకు లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాకు రాసిన లేఖలో పేర్కొన్నారు. తనపై వచ్చిన ఆరోపణలకు సంబంధించిన ప్రశ్నలకు బదులుగా హానికరమైన, తన పరువుకు నష్టం కలిగించేలా పక్షపాతంతో వ్యవహరించారని మహువా ఫిర్యాదు చేశారు.

Mahua Moitra Cash For Question : ఎథిక్స్‌ కమిటీ నైతికత కోల్పోయినందున.. ఆ కమిటీకి వేరే పెట్టాలన్నారు మహువా మెయిత్రా. తన పరువుకు నష్టం కలిగించే విధంగా ప్రశ్నించడం ద్వారా ఎథిక్స్‌ కమిటీ ఛైర్‌పర్సన్‌ పక్షపాతంతో వ్యవహరించారని, ఆయన తీరుతో 11మంది కమిటీ సభ్యుల్లో ఐదుగురు సమావేశాన్ని బహిష్కరించినట్లు మహువా తెలిపారు. లోక్‌సభలో అడిగే ప్రశ్నలకు సంబంధించిన పోర్టల్‌.. లాగిన్‌, పాస్‌వర్డ్‌ షేరింగ్‌కు సంబంధించిన నిబంధనలు వెల్లడించాలని లోక్‌సభ సచివాలయానికి రాసిన లేఖలో మహువా కోరారు. ఎంపీలకు ఈ నియమాలు ఎందుకు ఇవ్వలేదన్న మహువా.. అలాగైతే ప్రతి ఒక్క ఎంపీ తమ లాగిన్‌ ఐడిని అనేకమంది వ్యక్తులతో ఎందుకు పంచుకుంటున్నారని ప్రశ్నించారు.

'ప్యానెల్​ సభ్యులు దుర్యోధనుడిలా.. ఛైర్మన్​ దృతరాష్ట్రుడిలా..'
పార్లమెంటు ఎథిక్స్‌ కమిటీ సభ్యులు వ్యక్తిగత ప్రశ్నలు అడిగారంటూ టీఎంసీ ఎంపీ మహువా మెయిత్రా చేసిన ఆరోపణలపై బంగాల్​ మంత్రి శశి పంజా స్పందించారు. బీజేపీ నిశ్శబ్ద ప్రేక్షకుడిగా ఉందని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్యానెల్​ సభ్యులు.. మహాభారతంలోని దుర్యోధనుడిలా ఆనందిస్తుంటే.. ఛైర్మన్​ ధృతరాష్ట్రుడిలా కూర్చున్నారని ఆరోపించారు. మహిళా సాధికారత అంటూ బీజేపీ బూటకపు ప్రకటనలు ఇస్తున వేళ.. ప్రజలు ఎన్నుకున్న మహిళా ఎంపీని ప్యానెల్​ అవమానించిందని ఆరోపణలు చేశారు. 'మహిళా సాధికారత, మహిళల భద్రతపై బీజేపీ పెద్ద ఎత్తున ఉపన్యాసాలు ఇస్తోంది. కానీ ఈరోజు ప్యానెల్‌లోని బీజేపీ సభ్యులు దుర్యాధనుడిలా, ఛైర్మన్‌ ధృతరాష్ట్రుడిలా కూర్చున్నారు. మొయిత్రాను వ్యక్తిగత ప్రశ్నలు అడిగి అవమానించారు" అని శశి పంజా ఆరోపించారు.

సొమ్ములు స్వీకరించి పార్లమెంటులో ప్రశ్నలు అడిగారనే ఆరోపణల్ని ఎదుర్కొంటున్న ఎంపీ మహువా మొయిత్రా.. విచారణ నిమిత్తం పార్లమెంటు నైతిక విలువల సంఘం (ఎథిక్స్‌ కమిటీ) ఎదుట గురువారం పలువురు విపక్ష ఎంపీలతో హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్యానెల్​ పలు వ్యక్తిగత అసభ్యకర, అనైతిక ప్రశ్నలు వేసిందని మహువా మండిపడ్డారు. 'అసలు అదేం మీటింగ్‌..? వారు నీచమైన ప్రశ్నలు వేశారు. చూడండి.. నా కళ్లల్లో నీళ్లు కనిపిస్తున్నాయా?' అని సమావేశం నుంచి బయటకు వెళ్తూ ఆమె విలేకరులను ప్రశ్నించారు. విచారణ జరుగుతుండగానే మొయిత్రా సహా ఇతర విపక్ష ఎంపీలు బయటకు వెళ్లిపోయారు. మరోవైపు, విపక్ష సభ్యుల విమర్శలపై ఎథిక్స్‌ కమిటీ ఛైర్మన్‌ వినోద్‌ సోంకార్‌ స్పందించారు. విచారణకు వారు ఏమాత్రం సహకరించలేదన్నారు. తనపైనా, కమిటీ పనితీరుపైనా అభ్యంతరకరమైన పదాలను వాడారని ప్రత్యారోపణ చేశారు.

Mahua Moitra Hiranandani : 'అవును.. లాగిన్‌, పాస్​వర్డ్​ నేనే ఇచ్చా'.. నిజం ఒప్పుకున్న ఎంపీ మహువా మొయిత్రా

Mahua Moitra Shashi Tharoor Photos : టీఎంసీ మహిళా ఎంపీ- శశిథరూర్ ఫొటోలు వైరల్​.. సస్పెండ్​ చేయాలని బీజేపీ డిమాండ్​!

Last Updated : Nov 3, 2023, 7:07 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.