మహారాష్ట్ర పోలీసు రిక్రూట్‌మెంట్(maharashtra police recruitment 2021) పరీక్షల్లో హైటెక్ కాపీయింగ్ పాల్పడేందుకు యత్నించిన ఓ వ్యక్తి గుట్టు రట్టు చేశారు అధికారులు. ఓ అభ్యర్థి ధరించిన మాస్క్‌లో ఎలక్ట్రానిక్ పరికరం(electronic devices in mask) ఉన్నట్లు గుర్తించిన పోలీసులు అతడిని అడ్డుకున్నారు. అయితే పట్టుకునేలోపే నిందితుడు పారిపోయాడని.. ఎలక్ట్రానిక్ ఫేస్ మాస్కును స్వాధీనం చేసుకున్నామని పోలీసులు వివరించారు.
ఇదీ జరిగింది..
పింప్రి చించ్వాడ్లోని(pimpri chinchwad police) ఓ పరీక్షా కేంద్రంలో పోలీసు కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్ పరీక్షకు ఏర్పాట్లు చేశారు అధికారులు. అభ్యర్థులను తనిఖీ చేస్తూ నిందితుడిని ఆపిన పోలీసులు.. అతని ఫేస్ మాస్క్‌లో ఎలక్ట్రానిక్ పరికరం ఉన్నట్లు గుర్తించారు. అయితే మాస్కును పరిశీలిస్తుండగానే.. అతను పారిపోయినట్లు శశికాంత్ దేవకాంత్(pimpri chinchwad police) అనే కానిస్టేబుల్ తెలిపాడు.
"నిందితుని ఫేస్ మాస్క్‌లో బ్యాటరీ, ఛార్జింగ్ పాయింట్, ఎయిర్‌టెల్ సిమ్ కార్డ్, ఓ స్విచ్, మైక్ వైర్లతో అనుసంధానం అయి ఉన్నాయి."
--హింజేవాడి పోలీసులు
నిందితునిపై మహారాష్ట్ర ప్రివెన్షన్ ఆఫ్ మాల్‌ప్రాక్టీసెస్ చట్టం-1982 (maharashtra prevention of malpractices act 1982) ప్రకారం కేసు నమోదు చేశారు హింజేవాడి పోలీసులు.
ఇవీ చదవండి: