ETV Bharat / bharat

ఇనుప రాడ్​లతో చావబాది.. చెత్తను తినిపించి..

ఓ వ్యక్తిపై అకారణంగా దాడి చేయడమే కాకుండా.. బాధితుడితో చెత్త తినిపించిన అమానుష ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మహారాష్ట్ర ముంబయిలో జరిగిన ఈ ఘటనలో ఒకరిని అరెస్టు చేసిన పోలీసులు.. పరారీలో ఉన్న మరో నిందితుని కోసం గాలిస్తున్నారు.

mumbai garbage
ముంబయి హత్యొొొ
author img

By

Published : Aug 2, 2021, 5:45 AM IST

ఓ వ్యక్తిని ఇనుప రాడ్‌తో చితకబాదారు ఇద్దరు దుండగులు. అంతటితో ఆగక బలవంతంగా చెత్తను తినిపించారు. గత నెలలో జరిగిన ఈ ఘోరం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మహారాష్ట్ర ముంబయిలో జోగేశ్వరి అనే ప్రాంతంలో తీసినట్లుగా చెబుతున్న ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది.

వీడియో రూపంలో తమ దృష్టికి వచ్చిన ఈ ఘటనపై స్పందించిన క్రైమ్ బ్రాంచ్ పోలీసులు.. అబ్దుల్ ఖలీద్ మాలిక్ షేక్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఇతను​ పలు కేసుల్లో నిందితునిగా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ప్రస్తుత ఘటనలో అతనిపై హత్యాయత్నం కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఇక మరో నిందితుడు.. షేక్​కు సహకరించిన ఫహిద్ జాహిద్ అలీ షేక్ పరారీలో ఉన్నాడని తెలిపారు.

'బాధితుడు, నిందితులు ఒకే ప్రాంతానికి చెందినవారని.. పాత వివాదానికి సంబంధించి వ్యక్తిగత కక్ష్యలే ప్రస్తుత వివాదానికి దారితీశాయని' పోలీసు అధికారి తెలిపారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.