ETV Bharat / bharat

బస్సు బోల్తా- 25 మందికి తీవ్ర గాయాలు - Pvt bus overturns in maharastra

Maharastra Bus Accident: మహారాష్ట్రలో ఘోర ప్రమాదం జరిగింది. నాసిక్- ఔరంగాబాద్​ జాతీయ రహదారిలో బస్సు బోల్తా పడి.. 25 మంది తీవ్రంగా గాయపడ్డారు.

UP Accident News
ప్రమాదం
author img

By

Published : Feb 4, 2022, 11:57 PM IST

Maharastra Bus Accident: మహారాష్ట్రలో ఘోర ప్రమాదం జరిగింది. నాసిక్- ఔరంగాబాద్​ జాతీయ రహదారిలో ప్రయాణికులతో వెళ్తున్న ప్రైవేటు బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో 25 మంది తీవ్రంగా గాయపడ్డారు.

నాసిక్​లోని ధామన్​గావ్​ మెడికల్ కళాశాలకు చెందిన విద్యార్థులు, ఉద్యోగులు ఈ బస్సులో ఉన్నట్లు అధికారులు తెలిపారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ఆరుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిపారు.

ఈ ప్రమాదం అనంతరం.. బస్సు డ్రైవర్ పరారీలో ఉన్నాడు. కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు.

యూపీలో మరో ప్రమాదం

UP Accident News: ఉత్తర్​ప్రదేశ్​లో మరో ప్రమాదం జరిగింది. లఖ్​నవూ- ఆగ్రా రహదారిలో నిలిచి ఉన్న ట్రక్​ను కారు ఢీకొట్టిన ఘటనలో ముగ్గురు మరణించారు. ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు.

మధ్యప్రదేశ్​ రీవా జిల్లా నుంచి ఆగ్రా వైపు వెళ్తున్న కారు.. నిలిచి ఉన్న ట్రక్కును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మరణించారు. మృతులను.. బ్రిజేశ్​ కుమార్​ త్రిపాఠి(43), అజయ్​ కుమార్​పాండే(46), శుభమ్​ త్రిపాఠీలుగా(28) గుర్తించారు. గాయపడిన వ్యక్తిని అశుతోశ్​ శుక్లాగా (36) తెలిసింది. వీరంతా మధ్యప్రదేశ్ రీవా జిల్లాకు చెందినవారని పోలీసులు తెలిపారు.

ఇదీ చదవండి: మద్యం మత్తులో యాక్సిడెంట్.. సైలెన్సర్​లో చిక్కుకున్న శవంతో 2.5కి.మీ..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.