మహారాష్ట్రలోని పలు జిల్లాలు సహా ముంబయిలో కుండపోత వర్షాలు(Mumbai rains) కురుస్తున్నాయి. మరో ఐదురోజులు వర్షాలు కురుస్తాయని హెచ్చరించిన వాతావరణ విభాగం.. ముంబయికి ఆరెంజ్ హెచ్చరిక జారీ చేసింది. పాల్ఘర్, రాయ్‌గఢ్, ఠాణెలకూ వర్ష సూచన చేసింది.
![Mumbai rains](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/12091843_andheri-east.jpg)
![Mumbai rains](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/12091843_mahim2.jpg)
![Mumbai rains](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/12091843_andheri-east2.jpg)
![Mumbai rains](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/12091843_andheri-east3.jpg)
ముంబయిలో గురవారం రాత్రి నుంచి కురుస్తున్న వర్షానికి లోతట్టు ప్రాంతాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. పలు ప్రాంతాల్లో రోడ్లపై మోకాళ్ల లోతులో వాననీరు నిలిచిపోయింది. అంధేరి, మహీం చర్చ్ తదితర ప్రాంతాల్లో వంతెన కింది ఉన్న రోడ్లతోపాటు సబ్‌వేల్లోకి వాననీరు పెద్దమొత్తంలో చేరటం వల్ల వాహనదారులు ఇబ్బందిపడుతున్నారు.
ఇదీ చూడండి: కల్తీ ఆహారంతో ఆరోగ్య భద్రతకు సవాలు