నెలరోజులుగా అక్కాచెల్లెళ్లపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన ముగ్గురిని మహారాష్ట్ర జాల్నా పోలీసులు అరెస్ట్ చేశారు.
ఇదీ జరిగింది.
జాల్నా జిల్లాలోని నిధోనాకు చెందిన అవినాశ్ కాకాసాహెబ్ జోగదంఢ్(18).. సెప్టెంబరు 3న నవీ ముంబయిలోని దిఘా ప్రాంతానికి చెందిన ఇద్దరు మైనర్ అక్కాచెల్లెళ్లకు మాయమాటలు చెప్పి జాల్నా తీసుకెళ్లాడు. వారిని అక్కడే అద్దె ఇంట్లో ఉంచి.. అవినాశ్ సహా అతని సోదరుడు శుభం జోగదంఢ్, దీపక్ రానా, గణేశ్ కాకాడే కలిసి నెలరోజులుగా అత్యాచారానికి పాల్పడ్డారు. అయితే అక్టోబరు 1న ఆ బాలికలిద్దరూ.. అక్కడ నుంచి తప్పించుకుని ఔరంగబాద్ చేరుకుని.. పోలీసులను ఆశ్రయించారు. దీంతో కేసు నమోదు చేసి.. కాడిం జాల్నా పోలీసులకు అప్పగించారు ఔరంగబాద్ పోలీసులు.
డీఎస్పీ నీరజ్రాజ్గురుతో కలిసి కాడిం జాల్నా పోలీసులు.. రాత్రికి రాత్రే సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ప్రధాన నిందితుడు అవినాశ్ జోగదంఢ్.. రైలులో నాందేడ్ నుంచి జాల్నా వెళ్తున్నట్లు తెలుసుకున్న పోలీసులు.. తెల్లవారుజామున 2 గంటలకు అరెస్ట్ చేశారు. శుభం జోగదంఢ్, గణేశ్ కాకాడేను వేర్వేరు చోట్ల గాలించి అదుపులోకి తీసుకున్నారు.
ఇదీ చూడండి: లఖింపుర్‌ఖేరి ఘటనకు 9 రోజుల ముందే కేంద్రమంత్రి వార్నింగ్!