మహారాష్ట్రలో కరోనా మళ్లీ తీవ్రరూపం దాల్చింది. బుధవారం ఒక్కరోజే 23వేల 179 మందికి కొవిడ్ పాజిటివ్‌గా నిర్ధరణ అయింది. ఈ ఏడాది నమోదైన కేసుల్లో ఇదే రికార్డు కాగా.. ఒక్కరోజులో వెలుగుచూసిన కేసుల్లో ఇవి ఆరో అత్యధికం. గతేడాది మార్చిలో ఆ రాష్ట్రంలో తొలి కేసు బయటపడగా.. సెప్టెంబర్ నెలలో రికార్డు స్థాయిలో కేసులు వెలుగుచూశాయి.
సెప్టెంబర్ 11న అత్యధికంగా 24 వేల 886 మందికి వైరస్ సోకింది. సెప్టెంబర్ 17న 24,619 కేసులు నమోదయ్యాయి.
ఆ తర్వాత అదే నెల 9, 6, 10 తేదీల్లో వరుసగా 23816, 23350, 23446 మంది వైరస్ బారినపడ్డారు.
ఆ రాష్ట్రంలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 23లక్షల 70వేల 507కు చేరింది. కొవిడ్ బారినపడిన వారిలో మరో 84 మంది ప్రాణాలు కోల్పోగా.. మరణాల సంఖ్య 53వేల 80కి ఎగబాకింది. ఈ ఒక్కరోజే.. 9,138 మంది వైరస్‌ను జయించగా మొత్తం రికవరీల సంఖ్య 21.63 లక్షలు దాటింది. 1.52 లక్షల యాక్టివ్ కేసులున్నాయి.
ఇదీ చదవండి: ఆశ్రమ పాఠశాలలో 30 మంది విద్యార్థులకు కరోనా