దేశంలో పలు రాష్ట్రాల్లో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. మహారాష్ట్రలో కొత్తగా.. 30,535 మందికి పాజిటివ్‌గా నిర్ధరణ అయింది. గతేడాది మార్చి 1 నుంచి ఇప్పటివరకు నమోదైన కేసుల్లో ఇవే అత్యధికం.
ఈ కేసులతో కలిపి మహారాష్ట్రలో మొత్తం బాధితుల సంఖ్య 24,79,682కు చేరింది. మరో 99 మంది ప్రాణాలు కోల్పోగా మొత్తం మరణాల సంఖ్య 53,399కి పెరిగింది.
మహారాష్ట్రలోని ముంబయి నగరంలో కరోనా వ్యాప్తి ఉద్ధృతంగా కొనసాగుతోంది. కొత్తగా 3,755 మందికి వైరస్ సోకింది. మరో 10 మంది మరణించారు.
ముంబయిలో కేసులు..
- మొత్తం కేసులు: 3,62,654
- మొత్తం రికవరీలు: 3,26,708
- మొత్తం మరణాలు: 11,582
- యాక్టివ్ కేసులు: 23,448
దిల్లీలో కేసులు..
దిల్లీలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. కొత్తగా 823 కేసులు నమోదయ్యాయి. వైరస్ ధాటికి మరొకరు బలయ్యారు.
- మొత్తం కేసులు: 6,47,984
- మొత్తం రికవరీలు: 6,33,410
- మొత్తం మరణాలు: 10,956
- యాక్టివ్ కేసులు: 3,618
కేరళ, కర్ణాటక, గుజరాత్‌లోనూ కరోనా కేసులు పెరుగుతున్నాయి.