ETV Bharat / bharat

'అజిత్ పవార్​ వర్గీయులపై అనర్హత పిటిషన్.. ఆ ఎమ్మెల్యేలంతా NCPతోనే' - ఎన్​సీపీ సంక్షోభం

Maharashtra political news : అజిత్ పవార్‌కు 36 మంది ఎమ్మెల్యేల మద్దతు లేదని ఎన్​సీపీ వెల్లడించింది. ఏక్​నాథ్​ షిండే ప్రభుత్వంలో చేరిన వారందరిపై అనర్హత పిటిషన్ వేయబోతున్నట్లు తెలిపింది. మరోవైపు, ప్రతిపక్షాల ఐక్యతపై ఈ పరిణామాలు ఎటువంటి ప్రభావం చూపవని సుప్రియా సూలే పేర్కొన్నారు.

ncp-crisis-supriya-sule-on-ajit-pawar-ajit-pawar-doesnt-have-support-of-majority-of-mla-said-sule
ఎన్​సీపీ మహారాష్ట్ర
author img

By

Published : Jul 3, 2023, 7:47 AM IST

Maharashtra political news : మహారాష్ట్రలో నాటకీయ పరిణామాల మధ్య ఏక్‌నాథ్ శిందే ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా చేరిన అజిత్ పవార్‌కు 36 మంది ఎమ్మెల్యేల మద్దతు లేదని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్​సీపీ) పేర్కొంది. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షురాలు సుప్రియా సూలే, మహారాష్ట్ర యూనిట్ చీఫ్ జయంత్ పాటిల్ తమ 53 మంది ఎమ్మెల్యేలను సంప్రదిస్తున్నారని ఎన్​సీపీ జాతీయ అధికార ప్రతినిధి క్లైడ్ క్రాస్టో పేర్కొన్నారు. ఈ రోజు దీనిపై ఓ స్పష్టత వస్తుందని చెప్పారు.

వారిపై అనర్హత పిటిషన్ : జయంత్ పాటిల్​
ఏక్​నాథ్​ శిందే ప్రభుత్వంలో చేరిన అజిత్​ పవార్​తో పాటు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన మరో ఎనిమిది మందిపై.. అనర్హత పిటిషన్ వేయబోతున్నట్లు జయంత్ పాటిల్​ వెల్లడించారు. ఆదివారం మీడియాతో మాట్లాడిన ఆయన.. అనర్హత పిటిషన్​ను స్పీకర్​ రాహుల్​ నర్వేకర్​కు పంపించినట్లు పేర్కొన్నారు. ఎన్​సీపీ శ్రేణులంతా శరద్​ పవార్​తో ఉన్నారనే సమాచారాన్ని కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా చేరవేసినట్లు ఆయన వివరించారు.

ncp crisis supriya sule on ajit pawar Ajit Pawar doesnt have support of majority of MLA said sule
మీడియాతో మాట్లాడుతున్న సూలే, జయంత్​

288 మంది సభ్యులున్న మహారాష్ట్ర అసెంబ్లీలో ఎన్​సీపీకి 53 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టంలోని నిబంధనల ప్రకారం అనర్హత వేటు పడకూడదంటే.. అజిత్ పవార్‌కు కనీసం 36 మంది శాసనసభ్యుల మద్దతు అవసరం ఉంటుంది. అయితే ప్రస్తుతం ఆయనకు ఆ మద్దతు లేదని క్రాస్టో అన్నారు. మరోవైపు, తనకు 40 మంది ఎమ్మెల్యేలు, ఆరుగురు ఎమ్మెల్సీల మద్దతుందని రాజ్‌భవన్‌కు అజిత్ పవార్ లేఖ ఇచ్చినట్లు ఆయన వర్గీయులు తెలిపారు. డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం మాట్లాడిన అజిత్ పవార్ ఎన్సీపీలో ఎలాంటి చీలిక లేదని, భవిష్యత్తులో జరిగే అన్ని ఎన్నికల్లోనూ ఎన్​సీపీ పేరు, గుర్తుపైనే పోటీ చేస్తామని చెప్పారు. శిందే నేతృత్వంలోని ప్రభుత్వంలో చేరాలనే నిర్ణయానికి తమ ఎమ్మెల్యేలు మద్దతు పలికారు అని ఆయన పేర్కొన్నారు.

'ప్రతిపక్షాల ఐక్యతపై ప్రభావం చూపదు'
ఎన్​సీపీలో జరుగుతున్న పరిణామాలు ప్రతిపక్షాల ఐక్యతపై ఎటువంటి ప్రభావం చూపవని​ సుప్రియా సూలే అన్నారు. ఈ పరిమాణంతో ఎన్​సీపీ అధ్యక్షుడు, తన తండ్రి శరద్​ పవార్ స్థాయి, పార్టీ విశ్వనీయత మరింత పెరుగుతుందన్నారు. మహారాష్ట్ర ఉప ఉపముఖ్యమంత్రిగా అజిత్​ పవార్​ ప్రమాణ స్వీకారం చేసిన కొద్ది గంటలకే ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.

ఆదివారం అర్ధరాత్రి మీడియాతో మాట్లాడిన సూలే.. అజిత్ పవార్​కు భిన్నమైన అభిప్రాయాలు ఉండొచ్చని.. కానీ సోదరుడితో తాను ఫైట్​ చేయయని, ఒక చెల్లిగా ఆయనపై ఎప్పుడూ ప్రేమ ఉంటుందని వెల్లడించారు. "ఎమోషనల్ రిలేషన్స్, ప్రొఫెషనల్ వర్క్ అనేవి రెండు వేర్వేరు విషయాలు. ఆ రెండింటినీ నేనెప్పటికీ కలపను" అని సూలే చెప్పుకొచ్చారు. అజిత్​ పవార్​కు ఎంత మంది మద్దతు ఉందో తెలీదని.. తాము తమ పార్టీ ఎమ్మెల్యేలతో మాట్లాడుతున్నామని చెప్పారు. ప్రతి ఎన్​సీపీ ఎమ్మెల్యే విలువైనవారేనని.. తామంతా ఒకే కుటుంబమని, అందరం ప్రేమానురాగాలు, గౌరవంతో ఉన్నామని ఆమె వివరించారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.