ఫోన్ విషయంలో తన తమ్ముడితో గొడవ పడిన ఓ 16 ఏళ్ల బాలిక.. ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన మహారాష్ట్ర ముంబయిలో(Maharashtra Mumbai News) జరిగింది.
అసలేమైందంటే..?
ముంబయిలోని కాందివలీ(Kandivali Maharashtra) తూర్పు ప్రాంతానికి చెందిన ఓ బాలికకు(16) ఇద్దరు చెల్లెళ్లు, ఓ తమ్ముడు ఉన్నాడు. వారి తండ్రి ఆటో రిక్షా డ్రైవర్. ఆరుగురు సభ్యులున్న ఆ కుటుంబమంతా ఒకే ఫోన్ను వాడుతున్నారు. శనివారం రాత్రి తనను ఫోన్లో గేమ్స్ ఆడనివ్వటం లేదని సదరు బాలిక తన తమ్ముడితో గొడవకు దిగింది.
ఈ క్రమంలో కోపోద్రిక్తురాలైన ఆమె.. సమీపంలోని ఓ దుకాణం నుంచి ఎలుకలను చంపే విషం తెచ్చుకుంది. కుటుంబ సభ్యులంతా చూస్తుండగానే.. దాన్ని తాగిందని ఎస్ఐ సంతోష్ ఖర్దే తెలిపారు. వెంటనే కుటుంబ సభ్యులు.. ఆమెను శతాబ్ది ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారని చెప్పారు. అక్కడ ఆమెకు చికిత్సకు స్పందించలేదని పేర్కొన్నారు.
ఇదీ చూడండి: దివ్యాంగుల సాహసం.. పర్వతారోహణలో ప్రపంచ రికార్డు!
ఇదీ చూడండి: కళాఖండాల కోసం ఖండాతరాల వేట!