ETV Bharat / bharat

ఆ బీచ్‌లకు కొట్టుకొచ్చిన మృతదేహాలు.. వారివేనా? - గుజరాత్​ వార్తలు

మహారాష్ట్రలోని రాయ్​గఢ్​ బీచ్​లో మూడు రోజుల్లో 8 మృతదేహాలు బయటపడగా.. గుజరాత్​లోని వల్సాద్​ బీచ్​లో మరో నాలుగు వెలుగు చూశాయి. అయితే.. ఈ మృతదేహాలన్నీ గత సోమవారం గల్లంతైన 'పీ-305' నౌకకు సంబంధించినవిగా అధికారులు అనుమానిస్తున్నారు.

Beach, Deadbody
బీచ్​, మృతదేహాలు
author img

By

Published : May 23, 2021, 9:46 AM IST

మహారాష్ట్రలోని రాయ్​గఢ్​ బీచ్​లో మృతదేహాలు కలకలం రేపుతున్నాయి. మూడు రోజుల వ్యవధిలో 8 మృతదేహాలు లభ్యమయ్యాయని ఓఎన్​జీసీ అధికారులు తెలిపారు. తౌక్టే ధాటికి గల్లంతైన 'బార్జి పీ-305'కు చెందినవే ఇలా కొట్టుకొచ్చాయని వారు భావిస్తున్నట్లు చెప్పారు.

Dead body found in Raigarh beach
రాయ్​గఢ్​ బీచ్​లో మృతదేహాన్ని పరిశీలిస్తున్న అధికారులు

సమాచారం అందుకున్న ముంబయి పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం అలీబాగ్​ జిల్లా ఆస్పత్రికి తరలించి, డీఎన్​ఏ నమూనాలను సేకరించినట్టు తెలిపారు. బాధిత కుటుంబ సభ్యులు, బంధువులెవరైనా వస్తే వారి నమూనాలను పోల్చి.. ఆ తర్వాత వారికి మృతదేహాలను అప్పగిస్తామని స్థానిక ఎస్పీ తెలిపారు.

గుజరాత్​లోనూ..

గుజరాత్​లోనూ ఇదే తరహాలో అనుమానాస్పద రీతిలో నాలుగు మృతదేహాలు తీవ్ర కలకలం సృష్టిస్తున్నాయి. అరేబియా సముద్రం ఒడ్డున వల్సాద్​ బీచ్​లో ఇవి లభ్యమైనట్టు అధికారులు తెలిపారు. మృతదేహాలకు లైఫ్​ జాకెట్​ ఉందని అధికారులు తెలిపారు.

Valsad Beach, Deadbodies
వల్సాద్​ బీచ్​లో మృతదేహాలు

ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. మృతదేహాలను శవపరీక్ష నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. వారి గుర్తింపు కోసం ప్రయత్నాలు ప్రారంభించామన్నారు.

'పీ-305' బాధితులేనా..!

తౌక్టే ధాటికి ఈ నెల 17న(సోమవారం) బార్జి పీ-305, వరప్రద టగ్​బోటు నౌకలు గల్లంతయ్యాయి. వారిలో ఇప్పటివరకు 20 మంది ఆచూకీ గల్లంతైంది. వారి కోసం అధికారులు గాలిస్తున్న తరుణంలో.. ఈ మృతదేహాలు కొట్టుకురావటం అనుమానాలకు తావిస్తోంది.

ఇదీ చదవండి: 66కు పెరిగిన మృతులు.. గజ ఈతగాళ్లతో గాలింపు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.