ETV Bharat / bharat

మహారాష్ట్రలో కొత్తగా 47వేల మందికి కరోనా - మహారాష్ట్రలో కరోనా కేసులు

దేశంలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. అయితే మహారాష్ట్ర, దిల్లీల్లో ఒక్కరోజులో నమోదైన కేసుల్లో తగ్గుదల కనిపించింది. కర్ణాటక, తమిళనాడు, గుజరాత్​ సహా పలు రాష్ట్రాల్లో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది.

Maharashtra coronavirus cases and deaths updates
మహారాష్ట్రలో తగ్గిన కరోనా
author img

By

Published : Apr 5, 2021, 10:04 PM IST

మహారాష్ట్రలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. తాజాగా 47,288 మంది వైరస్ బారిన పడ్డారు. మరో 155మంది చనిపోయారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 30 లక్షల 57 వేలు దాటగా.. మృతుల సంఖ్య 56,033కు చేరింది. కాగా సోమవారం ఒక్కరోజే 26,252 మంది వైరస్​ను జయించారు.

ముంబయి నగరంలోనే 9,857 మందికి కరోనా పాజిటివ్ తేలగా.. 21 మంది మృతి చెందారు.

కన్నడనాట కరోనా ఉద్ధృతి

కర్ణాటకలో కరోనా విజృంభిస్తోంది. ఒక్కరోజే 5,279 మంది కరోనా బారిన పడగా.. మరో 32 మంది కొవిడ్​తో ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో మొత్తం బాధితుల సంఖ్య 10 లక్షల 20 వేలు దాటింది.

  • తమిళనాడులో కొవిడ్​ బాధితుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. కొత్తగా 3,672 మందికి వైరస్ సోకింది. మరో 11మంది మరణించారు.
  • దిల్లీలో ఒక్కరోజులో నమోదైన కేసుల సంఖ్యలో తగ్గుదల కనిపిస్తోంది. కొత్తగా 3,548 మందికి వైరస్​ పాజిటివ్​ తేలింది. మరో 15 మంది చనిపోయారు.
  • గుజరాత్​లో తాజాగా 3,160 కేసులు నమోదవగా.. 15 మంది కొవిడ్​కు బలయ్యారు.
  • రాజస్థాన్​లో కొత్తగా 2,429 మందికి వైరస్​ సోకింది. మరో 12 చనిపోయారు.
  • కేరళలోనూ కొవిడ్ విస్తరణ కొనసాగుతోంది. ఒక్కరోజే 2,357 మందికి కరోనా పాజిటివ్​గా తేలింది.
  • హరియాణాలో సోమవారం ఒక్కరోజు 2000 వేలమందికి పైగా వైరస్​ బారిన పడ్డారు.

ఇదీ చూడండి: ఈ నెల 8న సీఎంలతో ప్రధాని భేటీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.