ETV Bharat / bharat

కొవిడ్​ బారినపడి మరో ఎమ్మెల్యే మృతి! - కాంగ్రెస్​ ఎమ్మెల్యే అంతపుర్కర్​ మృతి

మహారాష్ట్ర శాసనసభ్యుడు, కాంగ్రెస్​ నేత రావుసాహెబ్​ అంతపుర్కర్​ కొవిడ్​తో పోరాడుతూ ప్రాణాలు కోల్పోయారు. కొద్దిరోజుల క్రితం కరోనా బారినపడ్డ ఆయన.. ముంబయి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారని ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి.

Maharashtra Congress MLA Raosaheb  Antapurkar died with Covid-19
కొవిడ్​తో మరో కాంగ్రెస్​ ఎమ్మెల్యే మృతి
author img

By

Published : Apr 10, 2021, 1:08 PM IST

మహారాష్ట్ర ఎమ్మెల్యే, కాంగ్రెస్​ సీనియర్​ నేత రావుసాహెబ్ అంతపుర్కర్ కొవిడ్​ బారినపడి కన్నుమూశారు. 64 ఏళ్ల రావుసాహెబ్​.. ముంబయిలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి తుదిశ్వాస విడిచారని పార్టీ వర్గాలు తెలిపాయి.

మార్చి 19న కొవిడ్​ బారిన పడిన అంతపుర్కర్​ను.. తొలుత నాందేడ్​లోని ఓ ఆస్పత్రిలో చేర్పించారు. మెరుగైన చికిత్స కోసం.. అదే నెల 22న ముంబయి ఆస్పత్రికి తరలించారు. చికిత్స అనంతరం మార్చి 28న మరోసారి కొవిడ్​ పరీక్షలు నిర్వహించగా.. వైరస్​ లేనట్టు తేలింది. అయినప్పటికీ శ్వాసకోశ సంబంధిత వ్యాధితో ఇబ్బంది పడుతున్న ఆయన్ను ఐసీయూలో ఉంచారు. పరిస్థితి విషమించినందున.. ఈ నెల 1న వెంటిలేటర్​ అమర్చారు. అయినప్పటికీ ఫలితం లేకపోయింది. చివరకు గత రాత్రి(ఏప్రిల్​ 9న) ప్రాణాలు కోల్పోయారు.

అంతపుర్కర్​ అంత్యక్రియలు.. నాందేడ్​లోని ఆయన స్వగ్రామంలో జరగనున్నాయి.

ఇంజనీర్​ ఉద్యోగాన్ని వదులుకుని..

వృత్తి రీత్యా ఇంజనీర్ అయిన అంతపుర్కర్.. తన ఉద్యోగాన్ని వదులుకుని కాంగ్రెస్​లో చేరారు. 2009 అసెంబ్లీ ఎన్నికల్లో దెగ్లూర్​ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. 2014 ఎన్నికల్లో ఓడినా.. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి అదే స్థానంలోనే బరిలోకి దిగి గెలుపొందారు.

ఇదీ చదవండి: అసోం అంతర్జాతీయ పార్కుకు ఆ మూడు ఖడ్గమృగాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.