ETV Bharat / bharat

పులిని చూసేందుకు అడవికి వెళ్లాడు.. చివరకు?

author img

By

Published : Aug 21, 2021, 10:57 AM IST

పులి సంచరిస్తోందన్న వార్త ఆ ఊరిలో చక్కర్లు కొట్టింది. దాంతో పులిని చూడాలనుకున్న ఓ వ్యక్తి.. గ్రామస్థులతో కలిసి అటవీ ప్రాంతానికి వెళ్లాడు. అయితే.. అక్కడ అతనికి ఊహించని సంఘటన ఎదురైంది. ఇంతకీ ఏమైందంటే..?

man attacked tiger
పులి దాడి

వ్యక్తిపై దాడి చేసిన పులి

పులిని చూసేందుకు అడవికి వెళ్లిన ఓ వ్యక్తికి అనూహ్య ఘటన ఎదురైంది. అదే పులి అతనిపై పంజా విసిరింది. దాంతో తీవ్ర గాయాలపాలయ్యాడు. మహారాష్ట్ర చంద్రాపుర్​ జిల్లా చిముర్​ తాలుకాలో శుక్రవారం ఉదయం ఈ ఘటన జరిగింది.

ఏం జరిగిందంటే..?

మాలేవాడా గ్రామ సమీపంలోని అడవిలో పులి సంచరిస్తోందనే వార్త వ్యాపించింది. దాంతో ఘటనాస్థలికి అటవీశాఖ అధికారులు, పోలీసులు చేరుకున్నారు. అయితే.. అదే గ్రామానికి చెందిన మోరేశ్వర్​ చౌదరీ.. మరికొందరితో కలిసి పులిని చూసేందుకు అడవికి వెళ్లాడు.

అధికారులు, స్థానికులు హెచ్చరిస్తున్నప్పటికీ.. మోరేశ్వర్​ పొదల మాటున నక్కి ఉన్న పులి వద్దకు వెళ్లాడు. దాంతో ఒక్కసారిగా మోరేశ్వర్​పై పులి పంజా విసిరి దాడి చేసింది. ఈ ఘటనలో చేతులు, ఛాతీ, వీపుపై మోరేశ్వర్​కు తీవ్ర గాయాలయ్యాయి.

అతడిని హుటాహుటిన చిముర్​లోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు అటవీ శాఖ అధికారులు. మెరుగైన చికిత్స కోసం అక్కడి నుంచి చంద్రాపుర్​కు తరలించారు.

ఇదీ చూడండి: 3నెలల తర్వాత చిన్నారి చెంతకు 'తల్లి జ్ఞాపకాలు'

ఇదీ చూడండి: నాగ్​పుర్​లో మాయమై.. తాలిబన్లతో కలిసి ప్రత్యక్షమై..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.