ETV Bharat / bharat

రోడ్డు పక్కన దోసెలు వేసిన ఎన్టీఆర్ హీరోయిన్ - మహారాష్ట్రలో రోడ్డుపై ఎంపీ

ఎప్పటిలాగే హడావుడిగా ఉన్న రోడ్డు అది. అంతలో కొన్ని కార్లు అక్కడకు వచ్చాయి. అందులో నుంచి దిగిన మహిళా ఎంపీ సరాసరి.. రోడ్డు పక్కన ఉన్న దోసెల బండికి వద్దకు వచ్చారు. అక్కడివారితో ముచ్చటించారు. అంతేకాదు.. తానే స్వయంగా దోసె వేసుకుని, తిన్నారు.

navneet kaur rana
దోసెలు వేసిన ఎంపీ నవనీత్​ కౌర్​
author img

By

Published : Jul 8, 2021, 7:40 PM IST

Updated : Jul 8, 2021, 8:29 PM IST

రోడ్డుపక్కన దోసెలు వేస్తున్న నవనీత్​ కౌర్​

వీధి వ్యాపారులను ఆశ్చర్యపరిచారు మహారాష్ట్ర అమరావతి ఎంపీ నవనీత్​ కౌర్​ రాణా. ఓ తోపుడు బండి వద్ద దోసెలు తానే స్వయంగా వేసుకున్నారు. అంతేకాకుండా ఆ వ్యాపారులతోనూ ఆమె ముచ్చటించారు. వారి బాగోగులను తెలుసుకున్నారు.

వాహనాన్ని ఆపి..

షెగావ్​ నాకా, కాతోరా నాకా ప్రాంతాల్లో రహదారి అభివృద్ధి పనులను పరిశీలించడానికి ఎంపీ నవనీత్​ కౌర్ బయలుదేరారు. అయితే.. ఆకస్మాత్తుగా.. గాడ్గేనగర్​ వద్ద తన వాహనాన్ని ఆపారు. అనంతరం అక్కడ ఓ తోపుడు బండిపై దోసెలు అమ్మతున్న చోటుకు వెళ్లారు. తానే స్వయంగా దోసె వేసుకున్నారు.

Navneet kaur Rana
దోసెలు వేస్తున్న ఎంపీ నవనీత్​ కౌర్​
Navneet kaur Rana
దోసె తింటున్న నవనీత్​ కౌర్​
Navneet Rana
ఎంపీకి గ్లాసులో టీ పోస్తున్న వ్యాపారి

సమీపంలోని ఓ టీస్టాల్​ వద్దకు వెళ్లి అక్కడ తేనీరు సేవించారు నవనీత్​ కౌర్. అక్కడే ఓ వ్యాపారి వద్ద రెండు కిలోల మామిడి పండ్లు కొనుగోలు చేశారు. అయితే.. అతడు ఎంపీ నుంచి డబ్బులు తీసుకునేందుకు నిరాకరించాడు. దీంతో ఆమె అతడిని వారించి డబ్బులు ఇచ్చారు. ఈ క్రమంలో ఎంపీకి తమ వ్యాపారంలో ఎదురయ్యే సమస్యలను వారంతా ఏకరువు పెట్టారు. త్వరలోనే వాటిని పరిష్కరిస్తానని ఆమె హామీ ఇచ్చారు.

Navneet kaur Rana
టీ తాగుతున్న నవనీత్​ కౌర్​
Navneet kaur Rana
మామిడి పండ్లను కొనుగోలు చేస్తున్న ఎంపీ

రాజకీయాల్లోకి ప్రవేశించకముందు సినిమాల్లో నటించారు నవ​నీత్​ కౌర్ రాణా​. తెలుగులో జూనియర్​ ఎన్టీఆర్​ నటించిన యమదొంగ సినిమాలో కనిపించి సందడి చేశారు.

ఇదీ చూడండి: అమరావతి ఎంపీ నవనీత్​ కౌర్​కు సుప్రీంలో ఊరట

ఇదీ చూడండి: నవనీత్‌ కౌర్‌కు షాక్​- ఎంపీ పదవి పోతుందా?

Last Updated : Jul 8, 2021, 8:29 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.