వాటర్ పార్క్ అనగానే నీటి సవ్వడులు.. సందర్శకుల జలకాలటలు గుర్తుకొస్తాయి. కానీ మహారాష్ట్ర నాసిక్‌లోని వాటర్ పార్క్ మాత్రం పూల సోయగాలతో ఇంద్రలోకాన్ని తలపిస్తోంది. అదేంటి అనుకుంటున్నారా! వాటర్ పార్క్‌నే పూల పార్క్‌గా (flower park in nashik near trimbakeshwar) మార్చేశారు నిర్వహకులు. రంగురంగుల పూలతో పార్క్‌ను అందంగా తీర్చిదిద్దారు.
![flower park in Nashik](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/13670691_img1-1.jpg)
కరోనా కారణంగా దేశమంతటా వాటర్ పార్క్‌లను మూసివేయాల్సి వచ్చింది. వాటి మీద అధారపడ్డవారికి జీవనోపాది లేకుండా పోయింది. వైరస్ ప్రభావం తగ్గుముఖం పట్టాక పర్యటకం ఊపందుకుంది. అయినా.. నాసిక్‌లో వాటర్ పార్క్‌కు పెద్దగా జనం రావడంలేదని గ్రహించిన నిర్వహకులు దానిని పూల పార్క్‌గా మార్చేశారు.
![flower park in Nashik](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/13670691_img1-2.jpg)
"నేను నాసిక్ నుంచి వచ్చాను. ఫ్లవర్ పార్క్ గురించి చాలా సార్లు విన్నాను. ఇక్కడ చాలా ఆహ్లాదకరంగా ఉంది. ఇలాంటి పార్క్ ఇండియాలో ఎక్కడ లేదు. రంగురంగుల పూలు ఆకట్టుకుంటున్నాయి."
-విశాల్, సందర్శకుడు
సందర్శకులకు అందమైన అనుభూతి కలిగేలా (Flower garden in Nashik) ప్రవేశద్వారం నుంచే గుమ్మటాలను పూలతో తీర్చిదిద్దారు. వాటర్ పార్క్‌లోని ఇన్ఫ్రాస్ట్రక్చర్కి అనుగుణంగా పూల మొక్కలను పెంచారు. పిల్లలు, పెద్దలను ఆకట్టుకునేలా పార్క్‌ను తయారు చేశారు. ఇందుకు దాదాపు ఆరు లక్షల మొక్కలను ఉపయోగించినట్లు పార్క్ నిర్వహకులు తెలిపారు. సుదూర ప్రాంతాల నుంచి కూడా పర్యటకులు వస్తున్నట్లు చెప్పారు. ఆదాయం కూడా బాగానే ఉందని వెల్లడించారు. నవంబర్ 1 నుంచి మార్చి వరకు ఈ పూల పార్క్‌ను నిర్వహించనున్నట్లు చెప్పారు.
"నా పేరు విహాన్ జోషి. నాకు ఈ పూల పార్క్ అంటే చాలా ఇష్టం. మేము చాలా ఉల్లాసంగా గడిపాము."
-విహాన్ జోషి, సందర్శకుడు
పార్క్ పట్ల స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పార్క్‌లోకి వస్తే మానసిక అలసట దూరం అవుతుందని చెబుతున్నారు. కుటుంబ సమేతంగా వచ్చి ఆహ్లాదంగా గడుపుతున్నారు.
![flower park in Nashik](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/13670691_img8.jpg)
ఇదీ చదవండి:బిహార్‌లో 'సర్పంచ్'గా అనుష్క రికార్డు