కామంతో కళ్లు మూసుకుపోయిన కొందరు వావివరసలు మరిచి.. క్రూరంగా ప్రవర్తిస్తుంటారు. సొంత వారిపైనే అఘాయిత్యాలకు పాల్పడుతుంటారు. ఇలాంటి ఘటనే మహారాష్ట్ర బుల్డానా జిల్లాలో వెలుగులోకి వచ్చింది. 65ఏళ్ల వృద్ధ తల్లిపైనే అత్యాచారానికి పాల్పడ్డాడో ప్రబుద్ధుడు.
జిల్లాలోని పింగల్గావూన్ గ్రామంలో కిశోర్ ఖందేర్(45) అనే వ్యక్తి.. తన తల్లి, భార్యతో నివసిస్తున్నాడు. ఇటీవల ప్రసవం కోసం పుట్టింటికి వెళ్లింది భార్య. ఈ క్రమంలో కామంతో కళ్లు మూసుకుపోయిన కిశోర్.. ఈనెల 5న రాత్రి వేళ తల్లిపైనే అఘాయిత్యానికి పాల్పడ్డాడు.
రాయ్‌పుర్ పోలీస్ స్టేషన్లో బాధితురాలు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేశారు పోలీసులు. ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉన్నట్లు తెలిపారు. ఈ ఘటనపై గ్రామంతో పాటు జిల్లావ్యాప్తంగా ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చూడండి: తల్లి మరణంలోనూ విధుల్లోనే 'పేపర్ బాయ్'!