ఠాణెలో ఓ వ్యభిచార ముఠా గుట్టు రట్టు చేశారు మహారాష్ట్ర పోలీసులు. ఈ క్రమంలో తమిళంతో పాటు ఇతర దక్షిణాది భాషల్లో నటించిన ఇద్దరు మహిళలను రక్షించారు.
ఈ ఘటనకు సంబంధించి ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ఇద్దరు మహిళలు ఉన్నారు.
"నౌపాడ ప్రాంతంలో రైడ్ జరిపి ఇద్దరు మహిళలను రక్షించాము. ముంబ్రాలోని అమృత్ నగర్‌కు చెందిన ఓ మహిళ ఈ కార్యకలాపాలు సాగిస్తోంది. పక్కా ప్రణాళికతో వారిని పట్టుకున్నాము. నిందితులను హసీనా మోమెన్, విశాల్, స్వీటీగా గుర్తించాము."
--- పోలీసులు.
ఈ ముగ్గురు.. డబ్బు ఆశ చూపించి నటులు, మోడళ్లను ఇందులోకి దింపుతున్నారని పోలీసులు వివరించారు. సోదాలో భాగంగా రూ. 2లక్షలు స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడించారు. ఈ వ్యవహారంపై కేసు నమోదు చేసినట్టు స్పష్టం చేశారు.
ఇదీ చూడండి:- శృంగారాన్ని నిరాకరించే హక్కు మహిళలకు తక్కువే!