ETV Bharat / bharat

'మహా'లో కరోనా రికార్డు- ఒక్కరోజే 60 వేల కేసులు - Maharashtra coronavirus

మహారాష్ట్రలో రికార్డు సంఖ్యలో కరోనా కేసులు బయటపడ్డాయి. కొత్తగా 60 వేల మంది వైరస్ బారిన పడ్డారు. 322 మంది చనిపోయారు. మరో 30 వేల మందికిపైగా మహమ్మారి నుంచి కోలుకున్నారు. దిల్లీ, కర్ణాటక, తమిళనాడు సహా పలు రాష్ట్రాల్లో కొవిడ్​ కేసులు భారీగా నమోదవుతున్నాయి.

Maha sees highest daily count of 59,907 COVID-19 cases, 322 die
మహా కరోనా రికార్డు- ఒక్కోరోజే 60 వేల కేసులు
author img

By

Published : Apr 7, 2021, 11:03 PM IST

మహారాష్ట్రలో కరోనా కేసులు బుధవారం రికార్డు స్థాయిలో నమోదయ్యాయి. ఒక్కరోజే 59,907 కేసులు బయటపడ్డాయి. మరో 322 మందికి కొవిడ్​కు బలయ్యారు. తాజాగా 30,296 మంది వైరస్​ నుంచి కోలుకున్నారు.

కన్నడ నాట 7 వేల కేసులు

కర్ణాటకలో కరోనా పంజా విసురుతోంది. ఒక్కరోజే 6,976 కేసులు నమోదయ్యాయి. 35 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం బాధితుల సంఖ్య 10 లక్షల 33 వేలు దాటింది.

యూపీలో ఉగ్రరూపం

ఉత్తర్​ప్రదేశ్​లో కరోనా ఉగ్రరూపం దాల్చుతోంది. కొత్తగా 6,023 మంది కొవిడ్​ బారిన పడ్డారు. మరో 40 మంది కరోనాకు బలయ్యారు.

దిల్లీలో తాజాగా 5,506 మందికి వైరస్​ సోకగా.. 20 మంది మరణించారు.

రాష్ట్రంతాజా కేసులుతాజా మరణాలు
మధ్యప్రదేశ్​ 4,40313
తమిళనాడు3,98617
గుజరాత్​3,57522
కేరళ3,50216
రాజస్థాన్​2,80112
హరియాణా2,366 11

ఇదీ చూడండి: ఛత్తీస్​గఢ్​లో లాక్​డౌన్​.. ఆ రాష్ట్రాల్లో రాత్రి కర్ఫ్యూ!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.