మహారాష్ట్ర ఠాణె జిల్లాలోని కల్వా ఆరోగ్య కేంద్రంలోని వైద్యసిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించారు. కరోనా వ్యాక్సిన్ తీసుకోవడానికి వెళ్లిన ఓ వ్యక్తికి పొరపాటున రేబిస్ టీకా వేశారు.
ఇదీ జరిగింది
కల్వాకు చెందిన రాజ్‌కుమార్ అనే వ్యక్తి.. కొవిడ్ టీకా తీసుకోవడానికి సమీపంలోని ఆరోగ్య కేంద్రానికి వెళ్లాడు. అయితే కరోనా వ్యాక్సిన్ వరుసలో కాకుండా పొరపాటున రేబిస్ టీకా వేసే లైన్లో నిలబడ్డాడు. టీకా తీసుకున్న తర్వాత అసలు విషయం తెలుసుకొని.. వైద్యులు రేబిస్ టీకా వేసినట్లు అధికారులు చెప్పాడు. దీంతో అతనిని వైద్య పర్యవేక్షణలో ఉంచిన అధికారులు.. రాజ్‌కుమార్ ఆరోగ్యంగానే ఉన్నట్లు తెలిపారు.
ఈ ఘటనపై ప్రాధమిక దర్యాప్తు జరిపిన అధికారులు.. ఆ ఆరోగ్య కేంద్రం ఇంఛార్జ్ సహా ఓ నర్సును సస్పెండ్ చేశారు.
ఇదీ చూడండి: Live Video: ఆటోతో ఢీకొట్టి.. కత్తులతో నరికి.. వ్యక్తి దారుణ హత్య