ETV Bharat / bharat

సోషల్ మీడియాకు భయపడి పెళ్లి రద్దు!

హిందూ వధువు, ముస్లిం వరుడికి మధ్య జరగాల్సిన వివాహం సోషల్ మీడియాలో వచ్చిన వ్యతిరేకత కారణంగా నిలిచిపోయింది. లవ్ జిహాద్ అంటూ పెళ్లిపై అభ్యంతరాలు వ్యక్తం కాగా.. ఈ మతాంతర వివాహాన్ని ఆపేస్తున్నట్లు వధువు తండ్రి.. మత పెద్దలకు లేఖ రాశారు.

love jihad
లవ్ జిహాద్
author img

By

Published : Jul 13, 2021, 4:09 PM IST

Updated : Jul 13, 2021, 5:18 PM IST

సామాజిక మాధ్యమాల నుంచి ఎదురైన వ్యతిరేకతతో హిందూ- ముస్లిం వధూవరుల మధ్య పెళ్లి ఆగిపోయింది. మహారాష్ట్ర నాశిక్ జిల్లాకు చెందిన 28 ఏళ్ల హిందూ మహిళ.. ముస్లిం వ్యక్తిని రిజిస్టర్​ మ్యారేజ్ చేసుకున్నారు. తల్లిదండ్రుల సమక్షంలో సంప్రదాయబద్ధంగా చేయాలనుకున్న పెళ్లి వేడుకను.. పలు వర్గాల నుంచి ఎదురైన వ్యతిరేకత కారణంగా ఆపేశారు. ఈ మేరకు మహిళ తండ్రి.. మత పెద్దలకు లేఖ రాశారు.

జులై 18న ఈ వివాహం జరగాల్సి ఉంది. ఈ పెళ్లికి సంబంధించిన పత్రిక సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. దీనికి పలువురు అభ్యంతరం వ్యక్తం చేశారు. సామాజిక మాధ్యమాల్లో పెళ్లికి వ్యతిరేకంగా పోస్టులు చేశారు. లవ్ జిహాద్ పేరిట వాట్సాప్ గ్రూపుల్లో పత్రికను షేర్ చేశారు. ఈ నేపథ్యంలో వివాహాన్ని రద్దు చేసుకుంటూ నిర్ణయం తీసుకుంటున్నట్లు మహిళ తండ్రి స్పష్టం చేశారు. మే నెలలో రిజిస్ట్రేషన్ మ్యారేజ్ జరిగినప్పటి నుంచి కూతురు తమ ఇంట్లోనే ఉంటోందని చెప్పారు. ప్రస్తుత పరిస్థితుల్లో దంపతులిద్దరూ కలిసి ఉంటారో లేదో అని అనుమానం వ్యక్తం చేశారు.

బెదిరింపు కాల్స్

రిజిస్ట్రేషన్ మ్యారేజ్ జరిగినప్పుడు ఈ కుటుంబంపై పెద్దగా ఒత్తిడేం రాలేదని సంబంధిత వ్యక్తులు తెలిపారు. కానీ, సోషల్ మీడియాలో నిరసన వ్యక్తం కాగానే.. మత పెద్దల నుంచి అభ్యంతరాలు వచ్చినట్లు వెల్లడించారు. పెళ్లి జరిపించకూడదని మహిళ కుటుంబ సభ్యులకు బెదిరింపు కాల్స్ కూడా వచ్చాయని చెప్పారు. చివరకు మహిళ తండ్రి రాసిన లేఖను.. మళ్లీ సంబంధిత వాట్సాప్ గ్రూపులలో షేర్ చేసినట్లు వివరించారు. ఈ నేపథ్యంలో.. ఓబీసీ ఆందోళన్ సమితి, విశ్వహిందూ పరిషత్, బజరంగ్ దళ్, హిందూ ఏక్తా మంచ్ వంటి సంఘాలకు కృతజ్ఞతలు తెలుపుతూ పోస్టులు వైరల్ అవుతున్నట్లు చెప్పారు.

ఇదీ చదవండి: అత్యాచారానికి యత్నించి.. కత్తితో ముఖంపై పొడిచి...

Last Updated : Jul 13, 2021, 5:18 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.