ETV Bharat / bharat

మహారాష్ట్రలో మళ్లీ లాక్​డౌన్​​ విధిస్తారా? - లాక్​డౌన్

పండగ వేళల్లో ప్రజలు కరోనా భయాలను బేఖాతరు చేస్తూ విచ్చలవిడిగా తిరిగారని మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్​ అసహనం వ్యక్తంచేశారు. మహారాష్ట్రలో మరోసారి లాక్​ డౌన్​ విధించే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు వెల్లడించారు.

Lockdown Maharashtra
మహారాష్ట్రలో మళ్లీ లాక్​ డౌన్​ విధించనున్నారా?
author img

By

Published : Nov 22, 2020, 5:10 PM IST

కరోనా రెండోసారి విజృంభిస్తుందనే అంచనాల మధ్య వైరస్ కట్టడికి ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటోందని తెలిపారు మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్. మళ్లీ లాక్​డౌన్​ విధించే అంశాన్నీ పరిశీలిస్తున్నట్లు చెప్పారు.

"వినాయక చవితి, దీపావళి సమయంలో ఎక్కడ చూసినా భారీగా జనసందోహం కనిపించింది. కరోనా రెండోసారి విజృంభిస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. సంబంధిత విభాగాలతో ఎప్పటికప్పుడు చర్చిస్తున్నాం. రానున్న 8-10 రోజుల పాటు పరిస్థితిని సమీక్షించి, లాక్​డౌన్​పై తగిన నిర్ణయం తీసుకుంటాం" అని తెలిపారు అజిత్.

మహారాష్ట్రలో పాఠశాలలు తిరిగి తెరిచేందుకు మార్గదర్శకాలు రూపొందించినట్లు చెప్పారు పవార్.

ఇదీ చదవండి:'కరోనా భయాలతోనే హజ్​కు తగ్గిన దరఖాస్తులు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.