ETV Bharat / bharat

కరోనా విజృంభణ- షిర్డీ ఆలయం మూసివేత

మహారాష్ట్రలో కరోనా ఉద్ధృతి దృష్ట్యా షిర్డీలోని బాబా ఆలయాన్ని మూసివేయాలని శ్రీ సాయిబాబా సంస్థాన్‌ ట్రస్ట్‌ (ఎస్‌ఎస్‌ఎస్‌టీ) నిర్ణయించింది. ఈ రోజు రాత్రి 8గంటల నుంచి ఈ నెల 30 వరకు మూసి ఉంచనున్నట్టు ప్రకటించింది. సాయి బాబా ఆలయంతో పాటు ప్రసాదాలయ, భక్త నివాస్‌ కూడా మూసివేయనున్నారు.

Shirdi temple shut till further orders
షిర్డీ ఆలయం మూసివేత..
author img

By

Published : Apr 5, 2021, 8:45 PM IST

కరోనా కోరలు చాస్తుండటంతో దేశం మరోసారి ఆంక్షల వలయంలోకి జారుకుంటోంది. తాజాగా ఆదివారం ఒక్కరోజే లక్షకు పైగా కొత్త కేసులు రావడంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది. దీంతో ఆయా రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాలు అప్రమత్తమవుతున్నాయి. కఠిన ఆంక్షలను అమలు చేసే దిశగా నిర్ణయాలు తీసుకుంటున్నాయి. జనం రద్దీ నియంత్రణపై దృష్టిపెట్టాయి. మహారాష్ట్రలో కొవిడ్‌ ఉగ్రరూపంతో రాత్రిపూట కర్ఫ్యూతో పాటు వీకెండ్‌ లాక్‌డౌన్‌ విధిస్తున్నట్టు అక్కడి ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే.

నేటి రాత్రి నుంచి షిర్డీ ఆలయం మూత

మహారాష్ట్రలో కరోనా ఉద్ధృతి దృష్ట్యా షిర్డీలోని సాయిబాబా ఆలయాన్ని మూసివేయాలని శ్రీ సాయిబాబా సంస్థాన్‌ ట్రస్ట్‌ (ఎస్‌ఎస్‌ఎస్‌టీ) నిర్ణయించింది. ఈ రోజు రాత్రి 8గంటల నుంచి ఈ నెల 30 వరకు మూసి ఉంచనున్నట్టు ప్రకటించింది. సాయి బాబా ఆలయంతో పాటు ప్రసాదాలయ, భక్త నివాస్‌ కూడా మూసివేయనున్నారు. ఈ సమయంలో రోజువారీ పూజా కార్యక్రమాలు మాత్రం కొనసాగనున్నాయి. ఆలయం మూసివేసినప్పటికీ ఎస్‌ఎస్‌ఎస్‌టీ ఆధ్వర్యంలో ప్రారంభించిన కొవిడ్‌ ఆస్పత్రి, ఇతర ఆస్పత్రులు మాత్రం పనిచేస్తాయని ట్రస్టు స్పష్టంచేసింది.

ముంబయిలో లోకల్‌ రైళ్లు నిలిపేస్తారా?
దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో కరోనా కరాళ నృత్యం చేస్తుండటంతో మళ్లీ అక్కడ లోకల్‌ రైళ్లు నిలిపివేస్తారేమోనన్న ఆందోళన అక్కడి జనంలో వ్యక్తమవుతోంది. దీనిపై బీఎంసీ కమిషనర్‌ ఇక్బాల్‌ సింగ్‌ మాట్లాడుతూ.. ఇప్పటివరకు ముంబయి లోకల్‌ రైళ్లు నిలివేతపై ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదని స్పష్టంచేశారు. కానీ మహారాష్ట్ర ప్రభుత్వం మాత్రం పరిస్థితిపై సునిశితంగా పరిశీలిస్తోందని, వచ్చే రెండు వారాల్లో సమీక్షించనున్నట్టు తెలిపారు. రాష్ట్రంలో లాక్‌డౌన్‌ విధించడం ఇష్టంలేదంటూ ఇప్పటికే సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే ఇప్పటికే చెప్పారన్నారు. అందరూ జాగ్రత్తగా ఉండాలని ఆయన మరోసారి హెచ్చరించారు. జనం రద్దీని తగ్గించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. అయితే, ముంబయి లోకల్‌ రైళ్లు సర్వీసులు పునరుద్ధరించడం వల్లే కరోనా కేసులు అకస్మాత్తుగా పెరగడానికి కారణమయ్యాయని కొందరు విశ్లేషకులు చెబుతుండటం గమనార్హం.

వైద్య సిబ్బందికి సెలవులు రద్దు

కేంద్రపాలిత ప్రాంతమైన జమ్మూకశ్మీర్‌ ప్రభుత్వం వైద్య సిబ్బందికి సెలవులు రద్దుచేసింది. కొవిడ్‌ ఉద్ధృతి దృష్ట్యా అక్కడి ఆస్పత్రుల్లో పనిచేసే వైద్యులు, నర్సులు, పారామెడికల్‌ సిబ్బంది సెలవులను రద్దుచేస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ఇప్పటికే జారీచేసిన సెలవులను సైతం రద్దు చేసుకోవాలని సూచించింది.

మా రాష్ట్రానికి వస్తే.. ఆర్టీపీసీఆర్‌ రిపోర్టు తప్పనిసరి

బయటి రాష్ట్రాల నుంచి తమ రాష్ట్రానికి వచ్చే వారిపై రాజస్థాన్‌ ప్రభుత్వం నిబంధనలు విధించింది. 72గంటల వ్యవధిలో చేయించిన ఆర్టీపీసీఆర్‌ నివేదిక తప్పనిసరి చేసింది. లేకపోతే వారు 14 రోజుల హోం ఐసోలేషన్‌లో ఉండాల్సి వస్తుందని తెలిపింది. హోం ఐసోలేషన్‌ నిబంధనల్ని ఉల్లంఘిస్తే మాత్రం సంస్థాగత క్వారంటైన్‌కు తరలిస్తామని స్పష్టంచేసింది.

వేడుకలకు 100 మంది మించొద్దు: యోగి

కరోనా విజృంభణ నేపథ్యంలో యూపీలోని యోగి ఆదిత్యనాథ్‌ సర్కార్‌ కీలక ఆదేశాలు జారీచేసింది. వివాహాలు, ఇతర శుభకార్యాలకు హాజరయ్యే జనంపై పరిమితి విధించింది. 100 మందికి పాల్గొనరాదని స్పష్టంచేసింది. ఈ మేరకు సీఎం యోగి ఆదిత్యనాథ్‌ ఆదేశాలు జారీచేశారు. అతిథులు తప్పనిసరిగా మాస్క్‌లు ధరించి, భౌతికదూరం పాటించాలని సూచించారు. పంచాయతీ ఎన్నికలు జరగనున్న వేళ అభ్యర్థులు ఐదుగురితో మాత్రమే ప్రచారం నిర్వహించాలని సూచించారు. అందరూ మాస్క్‌లు ధరించాలని సీఎం ఆదేశించారు.

ఇదీ చదవండి: కరోనా ఉగ్రరూపం- 25 రోజుల్లోనే ఐదు రెట్లు వృద్ధి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.