ETV Bharat / bharat

మహారాష్ట్రలో దారుణం-యువతిపై యాసిడ్​, పెట్రోల్​ దాడి - యాసిడ్​ దాడి

మహారాష్ట్ర బీడ్​ జిల్లాలో దారుణ ఘటన జరిగింది. ఓ యువతి తన ప్రియుడి చేతిలో యాసిడ్​, పెట్రోల్​ దాడికి గురైంది. 16 గంటల పాటు నరకయాతన పడిన బాధితురాలు.. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది.

Maha: Acid attack victim dies after 16-hr fight for life; accused nabbed
మహారాష్ట్రలో దారుణం-యువతిపై యాసిడ్​, పెట్రోల్​ దాడి
author img

By

Published : Nov 16, 2020, 6:01 AM IST

Updated : Nov 16, 2020, 6:37 AM IST

ప్రియుడి చేతిలో యాసిడ్​, పెట్రోల్​ దాడికి గురైన యువతి.. 16 గంటల పాటు నరకం చూసింది. చివరకు ఆసుపత్రిలో ప్రాణం విడిచింది. మహారాష్ట్రలోని బీడ్​ జిల్లాలో శనివారం తెల్లవారుజామున ఈ దారుణం చోటుచేసుకుంది. హత్యకు గురైన యువతి స్వస్థలం నాందేడ్​ జిల్లాలోని శెల్​గావ్​. శనివారం రాత్రి ఆమె తన ప్రియుడు అవినాశ్​ రాజురె(25)తో కలిసి పుణె నుంచి స్వగ్రామానికి బయలుదేరింది. మార్గమధ్యంలో యలంబ్​ ఘాట్​ వద్ద వారు ఓ నిర్జన ప్రదేశంలో ఆగారు. రాత్రి 3 గంటల సమయంలో ఆమెపై ఆ యువకుడు యాసిడ్​తో దాడికి దిగాడు. ఆ తర్వాత పెట్రోలు పోసి నిప్పంటించాడు. నిందితుడు ఘటనా స్థలం నుంచి పారిపోయాడు.

కాలిన గాయాలతో ప్రాణాల కోసం ఆ యువతి అల్లాడిపోయింది. ఆదివారం మధ్యాహ్నం అటుగా వెళుతున్న కొందరు సమాచారం ఇవ్వడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కొన ఊపిరితో ఉన్న ఆమెను చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. కానీ చికిత్స పొందుతూ ఆమె ప్రాణాలు విడిచింది. అయితే యాసిడ్​ దాడి వెనుక కారణాలు ఇంకా తెలియలేదు.

Last Updated : Nov 16, 2020, 6:37 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.