ETV Bharat / bharat

జల్గావ్​ ఘటనపై రాష్ట్రపతి, ప్రధాని సంతాపం - Jalgaon Road Accident: 16 Labourers Killed, 2 Injured

మహారాష్ట్రలోని జల్గావ్​​ జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం 15మందిని బలితీసుకుంది. ఈ విషాద ఘటనపై రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​, ప్రధాని నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు.

Maha: 15 killed, 5 injured after truck overturns in Jalgaon
జల్గావ్​ ఘటనపై రాష్ట్రపతి, ప్రధాని సంతాపం..
author img

By

Published : Feb 15, 2021, 2:47 PM IST

Updated : Feb 15, 2021, 3:05 PM IST

మహారాష్ట్రలోని జల్గావ్​​ జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 15 మంది అక్కడికక్కడే మరణించారు. పొప్పడికాయల లోడ్​తో వెళ్తున్న లారీలో 15మంది కూలీలు ప్రయాణిస్తున్నారు. ధూలే నుంచి జల్గావ్​కు బయలుదేరిన లారీ అర్ధరాత్రి ఒంటిగంటకు కింగోన్ సమీపంలో బోల్తా కొట్టింది. ఆ సమయంలో వైద్య సహాయం అందక మృతుల సంఖ్య పెరిగినట్టు తెలుస్తోంది.

Maha: 15 killed, 5 injured after truck overturns in Jalgaon
ఘటనాస్థలంలో లారీ

ప్రమాదం జరిగిన చోటు

లారీలో ప్రయాణిస్తోన్న 15 మంది కూలీలు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. డ్రైవర్​ సహా.. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో 5సంవత్సరాల లోపు చిన్నారులు ఇద్దరు.. 15ఏళ్ల బాలిక ఉన్నారు. గాయపడిన వారందరినీ.. జల్గావ్​ ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. జల్గావ్​ జిల్లా రావీర్ పరిధి.. అభోదా, వివ్రా, కెర్హలా​ గ్రామాలకు చెందిన మృతులంతా రోజువారీ కూలీలుగా పనిచేస్తుంటారని పోలీసులు వివరించారు.

రహదారి పక్కన పడిపోయిన పండ్లు

సాంకేతిక లోపంతోనే..

సాంకేతిక లోపం కారణంగా ప్రమాదం సంభవించి ఉండొచ్చని జల్గావ్​ అదనపు ఎస్పీ చంద్రకాంత్​ గౌలీ వివరించారు. డ్రైవర్​పై కేసు నమోదు చేశామన్నారు. లారీకి సంబంధించిన ఫిట్​నెస్​ సర్టిఫికెట్​, ఇతర నింబంధన పత్రాలను ఇవ్వాల్సిందిగా రవాణాశాఖను కోరామని తెలిపారు.

మృతులు

మృతదేహాలు

రాష్ట్రపతి సంతాపం..

మహరాష్ట్రలోని జల్గావ్​ ప్రమాదంపై రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నట్టు తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాక్షించారు.

ప్రధాని దిగ్భ్రాంతి..

జల్గావ్‌ ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేశారు. ఈ వార్త విని తన మనసు ఎంతగానో బాధపడిందని తెలిపారు. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్టు పేర్కొన్నారు. ఈ మేరకు ప్రధాని కార్యాలయం ట్వీట్ చేసింది.

రూ. 2లక్షల పరిహారం..

ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్​ ఠాక్రే రూ. 2లక్షల పరిహారం ప్రకటించారు .

Last Updated : Feb 15, 2021, 3:05 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.