ETV Bharat / bharat

'మాయా అద్దం'.. మోసపోయిన 72 ఏళ్ల వృద్ధుడు.. వారిని నగ్నంగా చూడొచ్చని రూ.9 లక్షలు వసూలు

Magic Mirror Fraud : 'మాయా అద్దం' పేరుతో 72 ఏళ్ల వృద్ధుడ్ని మోసం చేశారు ముగ్గురు వ్యక్తులు. ఆ అద్దంతో మనుషులను నగ్నంగా చూడవచ్చని బాధితుడ్ని నమ్మించారు. అనంతరం అతడి నుంచి రూ.9 లక్షలు వసూలు చేశారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

magic-mirror-fraud-old-man-loses-rs-9-lakh-for-magic-mirror-to-see-people-naked
మ్యాజిక్​ మిర్రర్ స్కామ్
author img

By

Published : Aug 18, 2023, 4:49 PM IST

Magic Mirror Fraud : 'మాయా అద్దం'తో మనుషులను నగ్నంగా చూడవచ్చని 72 ఏళ్ల వృద్ధుడ్ని మోసం చేశారు ముగ్గురు వ్యక్తులు. అనంతరం బాధితుడి నుంచి రూ.9 లక్షలు వసూలు చేశారు. అమెరికా నాసా శాస్త్రవేత్తలే ఈ అద్దాన్ని ఉపయోగించారనే మాయామాటలతో.. వృద్ధుడ్ని బోల్తా కొట్టించారు. చివరకు మోసాన్ని గ్రహించిన బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు.

నిందితులు పార్థ సింగ్రే, మొలయా సర్కార్, సుదీప్తా సిన్హా రాయ్. బాధితుడు అవినాశ్​ కుమార్.. ఉత్తర్​ప్రదేశ్​కు చెందిన వ్యక్తి. తాము పురాతన వస్తువులను సేకరించే ప్రముఖ కంపెనీలో పనిచేస్తున్నట్లు బాధిత వృద్ధుడితో పరిచయం చేసుకున్నారు నిందితులు. వారి వద్ద ఓ 'మ్యాజిక్​ మిర్రర్' (మాయా అద్దం) ఉందని.. దానితో మనుషులను నగ్నంగా చూడవచ్చని అవినాశ్​ కుమార్​కు చెప్పారు. భవిష్యత్తును కూడా అంచనా వేయవచ్చని నమ్మబలికారు.

Old Man Duped for Magic Mirror : మ్యాజిక్ మిర్రర్​​ విలువ దాదాపు రూ.2 కోట్లు ఉంటుందని.. కానీ దాన్ని కేవలం 9 లక్షల రూపాయలకే అమ్ముతున్నట్లు వృద్ధుడికి మాయ మాటలు చెప్పారు. మొదట్లో నిందితుల మాటలపై సందేహం వ్యక్తం చేసిన అవినాశ్​ కుమార్​.. మాయా అద్దాన్ని కొనేందుకు సంకోచించాడు. దీంతో ఈ అద్దాన్ని చాలా మంది కొన్నట్లుగా తప్పుడు పత్రాలను బాధితుడికి చూపించారు నిందితులు. అమెరికా నాసా శాస్త్రవేత్తలు కూడా ఈ అద్దాన్ని ఉపయోగించారని అతడ్ని నమ్మించారు. చివరకు ఆ అద్దాన్ని కొనేందుకు ఒప్పుకున్న అవినాశ్​ కుమార్​.. అనంతరం ఒడిశా రాజధాని భువనేశ్వర్​కు పయనమయ్యాడు.

భువనేశ్వర్​లో నిందితులకు రూ.9 లక్షలు చెల్లించి.. ఆ మ్యాజిక్​ మిర్రర్​ను కొనుకున్నాడు వృద్ధుడు. చివరకు అదంతా మోసమని తెలుసుకున్నాడు. వెంటనే పోలీసులను ఆశ్రయించాడు. అవినాశ్​ ఫిర్యాదుతో.. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. పూర్తి స్థాయిలో విచారణ జరిపి నిందితులను అరెస్ట్ చేశారు. బంగాల్​లో వారిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.28వేలు, ఓ కారు, ఐదు మొబైల్​ ఫోన్​లు, కొన్ని నకిలీ ధ్రువపత్రాలు స్వాధీనం చేసుకున్నారు. నిందితుల చేతిలో ఇంకెవరైనా మోసపోయారా అన్న కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Deepfake Voice Cloning : 'డీప్​ ఫేక్'​ మోసం.. స్నేహితుడిలా మాట్లాడి రూ.30వేలకు టోకరా

Crime Journalist Murdered : క్రైమ్​ జర్నలిస్ట్ దారుణ హత్య.. ఇంటి తలుపు తట్టి.. కాల్పులకు తెగబడి..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.