ETV Bharat / bharat

మామ కొడుకులతో మాట్లాడినందుకు అక్కాచెల్లెళ్లపై దాడి - 2 women beaten news

మేనమామ కొడుకులతో ఫోన్​లో చాటింగ్ చేసినందుకు.. ఇద్దరు అక్కాచెల్లెళ్లపై కర్కశత్వాన్ని ప్రదర్శించారు వారి కుటుంబ సభ్యులు. విచక్షణారహితంగా దాడి చేశారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

2-women-beaten-by-family-members
మేనమామ కొడుకులతో చాటింగ్- తల్లితండ్రుల బీటింగ్
author img

By

Published : Jul 4, 2021, 3:55 PM IST

వాళ్లిద్దరూ అక్కాచెల్లెళ్లు. వారు చేసిన పని.. వారి మేనమామ కొడుకులతో ఫోన్​లో చాటింగ్ చేయడమే. ఇదే వారి కుటుంబ సభ్యులకు కోపం తెప్పించింది. ఆగ్రహంతో వారిని దారుణంగా కొట్టేలా ఉసిగొల్పింది. ఏడుగురు కలిసి విచక్షణారహితంగా ఆ గిరిజన యువతులను కొట్టారు. మధ్యప్రదేశ్​ ధార్ జిల్లాలో ఈ ఘటన జరిగింది.

యువతులపై దాడికి సంబంధించిన వీడియో

జూన్ 22న పిపాల్వ గ్రామంలో ఈ దాడి జరిగింది. అందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారడం వల్ల తాజాగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ ఇద్దరు అక్కాచెల్లెళ్ల వయసు 19, 20 అని తెలుస్తోంది. బాధితురాళ్లను ఓ మహిళ సహా పలువురు కలిసి తీవ్రంగా కొడుతున్న దృశ్యాలు వీడియోలో కనిపిస్తున్నాయి.

మేనమామ కొడుకులతో ఫోన్​లో చాటింగ్ చేయడం, మాట్లాడటం వంటివి చేసినందుకే యువతుల కుటుంబసభ్యులు ఆగ్రహానికి గురయ్యారని పోలీసులు తెలిపారు. జూన్ 25న ఈ వీడియో తమకు కనిపించిందని చెప్పారు. దర్యాప్తు చేయగా.. అందులో కుటుంబసభ్యులు కూడా ఉన్నారని తేలిందని వివరించారు. అనంతరం కేసు నమోదు చేసుకొని ఏడుగురిని అదుపులోకి తీసుకున్నట్లు స్పష్టం చేశారు.

ఇదీ చదవండి: ప్రేమించిందని బాలికను చావబాదిన తండ్రి, సోదరుడు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.