ETV Bharat / bharat

కూలిన సొరంగం- శిథిలాల్లో చిక్కుకుపోయిన కూలీలు! - కట్నిజిల్లాలోల కూలిన టన్నెల్​

madhya pradesh tunnel collapse: మధ్యప్రదేశ్​లోని కట్నిలో నిర్మాణ దశలో ఉన్న ఓ సొరంగం కూలిపోయింది. దాని లోపల పనిచేస్తున్న 9 మంది కూలీలు చిక్కుకుపోయారు. ఇప్పటి వరకు ఐదుగురు కూలీలను అధికారులు కాపాడారు.

Under-construction tunnel caves in, labourers trapped
కూలిన సొరంగం
author img

By

Published : Feb 13, 2022, 8:08 AM IST

madhya pradesh tunnel collapse: మధ్యప్రదేశ్​, కట్ని జిల్లాలోని స్లిమ్నాబాద్​లో నిర్మాణంలో ఉన్న బార్గీ కెనాల్​ ప్రాజెక్ట్​ సొరంగం కూలి శనివారం రాత్రి ప్రమాదం సంభవించింది. శిథిలాల కింద సుమారు 9 మంది కార్మికులు చిక్కుకున్నట్లు అధికారులు చెప్తున్నారు. వీరిలో ఇప్పటి వరకు ఐదుగురిని రక్షించినట్లు పేర్కొన్నారు. ఎస్​డీఈఆర్​ఎఫ్​ బృందాలు సహాయ చర్యలను వేగవంతం చేసినట్లు కట్ని కలెక్టర్​ ప్రియాంక్ వివరించారు. రెస్కూ ఆపరేషన్​ ఇంకా కొనసాగుతుందని తెలిపారు.

madhya pradesh tunnel collapse
కూలిన టన్నెల్

ఈ ఘటనపై మధ్యప్రదేశ్​ అడిషినల్​ చీఫ్​ సెక్రెటరీ రాజేశ్​ రాజోరా పరిస్థితులను ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. ఈ ప్రమాదం శనివారం రాత్రి జరిగినట్లు పేర్కొన్నారు. కలెక్టర్​, ఎస్​పీ ఇద్దరూ సంఘటనాస్థలంలోనే ఉండి పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే ముఖ్యమంత్రి శివరాజ్​ సింగ్​ చౌహాన్​.. జిల్లా అధికార యంత్రాంగంతో మాట్లాడినట్లు చెప్పారు. బాధితులకు అవసరం అయిన చికిత్సను అందించాలని సూచించారు.

  • #WATCH कटनी ज़िले के स्लीमनाबाद के बरगी अंडरग्राउंडर नहर की एक निर्माणाधीन सुरंग के धंसने से मलबे में फंसे 9 मज़दूर में से 5 को बचा लिया गया है,एसडीईआरएफ की टीम द्वारा बचाव अभियान जारी है: प्रशासन #MadhyaPradesh pic.twitter.com/huVuhfqCx2

    — ANI_HindiNews (@AHindinews) February 12, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇదీ జరిగింది...

భూగర్భ సొరంగం నిర్మాణ పనులు చేస్తున్న సమయంలో 70 అడుగుల లోతుకు కూలీలు తవ్వారు. ఈ క్రమంలో మట్టి ఒక్కసారిగా కూలిపోయింది. ఆ సమయంలో టన్నెల్​ కింద సుమారు 9 మంది కూలీలు ఉన్నారు. అయితే వారిలో 5 మందిని బయటకు తీశారు. మరో నలుగురు అదే టన్నెల్​ శిథిలాల కింద చిక్కుకున్నట్లు అధికారులు చెప్తున్నారు.

ఇదీ చూడండి: నిర్మాణంలోని ఇల్లు కూలి.. 24 మంది సజీవ సమాధి!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.