ETV Bharat / bharat

కుమారుడ్ని కరిచిందని కుక్కపై కర్కశత్వం- కత్తితో కోసి... - మధ్యప్రదేశ్​లో శునకం హత్య వీడియో

Man kills dog: మధ్యప్రదేశ్​లో రెండు దారుణ ఘటనలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. తన కుమారుడిని కరిచిందన్న కారణంతో శునకాన్ని దారుణంగా హింసించి చంపాడు ఓ వ్యక్తి. మరో ఘటనలో... నలుగురు వ్యక్తులు కలిసి తమ మిత్రునిపై దాడి చేశారు. సామాజిక మాధ్యమాల్లో ఈ వీడియోలు వైరల్​గా మారాయి.

man kills dog, mp viral videos of crime
శునకం హత్య
author img

By

Published : Dec 1, 2021, 2:54 PM IST

Man kills dog: మధ్యప్రదేశ్​లో అమానవీయ ఘటన వెలుగు చూసింది. మూగజీవి పట్ల ఓ వ్యక్తి కర్కశంగా ప్రవర్తించాడు. తన కుమారుడిని కరిచిందన్న కోపంతో ఓ అతి దారుణంగా శునకాన్ని హత్య చేశాడు. గ్వాలియర్ జిల్లా సిమారియాతల్ గ్రామంలో దాదాపు నెల క్రితం ఈ ఘటన జరిగింది.

వైరల్​గా మారగా..

Viral video of dog killing: శునకం హత్యకు సంబంధించిన వీడియో.. సామాజిక మాధ్యమాల్లో ఆదివారం వైరల్​గా మారింది. ఆ వీడియోలో నిందితుడు... శునకాన్ని చితకబాదుతున్నట్లుగా కనిపించింది. అది నొప్పితో విలవిలలాడుతున్న క్రమంలో దాని కాలిని పదునైన ఓ కత్తితో కోయడం కనిపించింది. దీనిపై గ్వాలియర్ పోలీసుల చర్యలు తీసుకోవాలని స్వచ్ఛంద సంస్థ పీపుల్ ఫర్ ద ఎథికల్ ట్రీట్​మెంట్ ఆఫ్ ఎనిమల్స్​(పెటా) కార్యకర్తలు డిమాండ్ చేశారు.

పెటా కార్యకర్త ఛాయా తోమర్​ ఫిర్యాదుతో నిందితునిపై పోలీసులు కేసు నమోదు చేశారని ఎస్పీ అమిత్ సంఘీ తెలిపారు. "తన కుమారుడి దవడను శునకం కరవగా నిందితుడు సాగర్ విశ్వాస్​ ఆగ్రహానికి గురయ్యాడని గ్రామస్థులు తెలిపారు. గ్రామంలోని మరో ఐదుగురిని కూడా శునకం కరించిందని వారు చెప్పారు" దేహత్ పోలీస్ స్టేషన్ ఇన్​ఛార్జ్​ ఆనంద్ కుమార్ తెలిపారు. కోర్టు ముందు హాజరు కావాలని నిందితుడికి నోటీసులు పంపించినట్లు చెప్పారు.

సామాజిక మాధ్యమాల్లో వీడియో వైరల్​గా మారడం వల్ల ఈ శునకం హత్య విషయాన్ని తాము తెలుసుకున్నామని పెటా కార్యకర్తలు ఆశర్​, ప్రియాన్షు జైన్​ తెలిపారు. మధ్యప్రదేశ్​లో ఇంతకుముందెన్నడూ తాము జంతువులపై ఇలాంటి క్రూర ఘటనను చూడలేదని చెప్పారు. జంతువులకు నేరాలకు వ్యతిరేకంగా చట్టాలను కఠినతరం చేయాల్సిన ఆవశ్యకతను ఈ ఘటన సాక్ష్యంగా నిలుస్తోందని వారు పేర్కొన్నారు.

ఇదీ చూడండి: గురుద్వారాలో 'మోడల్' ఫోటోషూట్​.. పాక్​కు భారత్​ సమన్లు

స్నేహితుడిపై దాడి..

Pawri ho rahi hai meme: రేవా జిల్లాలో దారుణం జరిగింది. పోలీస్ ఇన్​ఫార్మర్ అన్న అనుమానంతో నలుగురు వ్యక్తులు కలిసి తమ స్నేహితుడిని దారుణంగా చితకబాదారు. ఈ ఏడాది జులైలో ఈ ఘటన జరగగా.. పాకిస్థాన్​కు చెందిన సోషల్​ మీడియా ఇన్​ఫ్లూయెన్సర్ దానననీర్​ మొబీన్​ మీమ్​ 'పావ్​రీ హో రహీ హై' ద్వారా ఈ వీడియో వెలుగులోకి వచ్చింది.

బాధితుడు అమిత్​ పాండే ఫిర్యాదుతో నిందితులపై కేసు నమోదు చేశామని రేవా ఎస్​పీ నవ్​నీత్ భాసిమ్ మంగళవారం తెలిపారు. ఇద్దరు నిందితులను అరెస్టు చేశామని పేర్కొన్నారు. తన స్వగ్రామం ఖాజువాకు వెళ్తుండగా నలుగురు నిందితులు దారి మధ్యలై తనపై దాడి చేశారని తెలిపాడు. వారి మత్తు దందా గురించి తాను పోలీసులకు సమాచారం అందిస్తున్నాననే అనుమానంతో ఈ దాడికి పాల్పడ్డారని చెప్పాడు.

ఇదీ చూడండి: తల్లితో పులి పిల్లల విహారం.. వీడియో వైరల్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.