ETV Bharat / bharat

'న్యూడ్​ వీడియో కాల్స్'​తో తస్మాత్​ జాగ్రత్త! - సైబర్​ కేటుగాళ్ల పంథా

సోషల్​ మీడియా వేదికగా.. సైబర్​ నేరగాళ్లు పాల్పడుతున్న కొత్త తరహా మోసాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సైబర్​క్రైమ్​ పోలీసులు హెచ్చరించారు. ప్రజలను మోసగించే ప్రయత్నంలో మోసగాళ్లు 'న్యూడ్​ వీడియో కాల్స్​'తో కొత్త పద్ధతిని అవలంబిస్తున్నారని తెలిపారు.

Cyber fraudsters lure people with nude video calls
'న్యూడ్​ వీడియో కాల్స్'​తో తస్మాత్​ జాగ్రత్త!
author img

By

Published : Mar 31, 2021, 6:42 PM IST

సైబర్​ కేటుగాళ్లు.. ఇటీవల రోజుకో రీతిలో కొత్త తరహా మోసాలకు తెరతీస్తున్నారు. సోషల్​ మీడియా వేదికగా వీడియో కాల్​ చేసి.. మహిళల నగ్న దృశ్యాలు చూపిస్తూ, ప్రజలను నట్టేట ముంచుతున్నారు. మధ్యప్రదేశ్​లో ఇటీవల ఈ తరహా ఘటనలపై ఎక్కువ ఫిర్యాదులు రాగా.. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సైబర్​క్రైమ్​ పోలీసులు హెచ్చరిస్తున్నారు.

ఎలా చేస్తారంటే?

సైబర్​ కేటుగాళ్లు.. కొందరి ఖాతాదారుల ఫోన్​ నంబర్లను ర్యాండమ్​గా ఎన్నుకుంటారు. ఆ తర్వాత వారికి వీడియో కాల్​ చేసి.. మహిళలు నగ్న దృశ్యాలను చూపిస్తారు. అలాంటి కాల్స్​కు స్పందించినపుడు స్క్రీన్​ రికార్డింగ్ అప్లికేషన్​ ద్వారా బాధితులు, మహిళలతో చాట్​ చేస్తున్నట్టుగా రికార్డ్​ చేస్తారు. ఆపై దాన్ని అడ్డంగా పెట్టుకుని డబ్బు డిమాండ్​ చేస్తారు. లేదంటే సదరు వీడియోను సోషల్​ మీడియాలో షేర్​ చేస్తామని బ్లాక్​మెయిల్​కు పాల్పడతారు.

ఇదీ చదవండి: 'భారత్​లోని 52% కంపెనీలపై సైబర్​ దాడులు'

అపరిచితులతో..

ఇదో కొత్త తరహా మోసం అని భోపాల్​ సైబర్​ క్రైమ్​ ఏఎస్పీ అంకిత్​ జైశ్వాల్​ తెలిపారు. ఇంటర్నెట్​, ఇతర సోషల్​ మీడియా ప్లాట్​ఫామ్​లను ఉపయోగించేవారు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.

"వ్యక్తిగత వివరాలు, ఫొటోలను ఇతరులతో పంచుకోవడంపై వీలైనంత గోప్యతను ప్రదర్శించాలి. తెలియని నంబర్​ నుంచి వీడియో కాల్​ వస్తే.. దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ స్వీకరించొద్దు. ఒకవేళ లిఫ్ట్​ చేసినా ముఖాన్ని చూపించవద్దు. ఆన్​లైన్​ ద్వారా అపరిచితులతో ఫొటోలు, వీడియోలను పంచుకోకండి."

- అంకిత్​ జైశ్వాల్​, సైబర్​ క్రైమ్​ ఏఎస్పీ-భోపాల్​

ఇలాంటి కాల్స్​ను​ సైబర్​ క్రైమ్​ ముఠాలు దేశంలోని వివిధ రాష్ట్రాలు, విదేశాల నుంచి కూడా చేస్తున్నట్టు జైశ్వాల్​ తెలిపారు. బాధితుడి ప్రొఫైల్​ అడ్డం పెట్టుకుని, డబ్బు డిమాండ్​ చేసే ఇలాంటి కేటుగాళ్లతో జాగ్రత్తగా వ్యవహిరించాలన్నారు.

ఇదీ చదవండి: బదిలీ అయిన పోలీస్​కు గులాబీలతో ఘన వీడ్కోలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.