ETV Bharat / bharat

Lunar Eclipse 2023 : ఈ నెలలోనే చంద్రగ్రహణం.. మన దేశంలో ఎక్కడ కనిపిస్తుందో తెలుసా..?

Lunar Eclipse 2023 : ఆకాశంలో మరో అద్భుతమైన దృశ్యం కనువిందు చేయనుంది. ఈ నెలలోనే సూర్యగ్రహణం ఏర్పడింది. ఇప్పుడు ఇదే నెలలో చంద్రగ్రహణం ఏర్పడబోతోంది. మరి.. ఈ గ్రహణం మన దేశంలో కనిపిస్తుందా..? ఏ తేదీన ఏర్పడనుంది? వంటి విషయాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం.

Lunar Eclipse 2023
Lunar Eclipse 2023
author img

By ETV Bharat Telugu Team

Published : Oct 26, 2023, 2:50 PM IST

Lunar Eclipse 2023 : ఆకాశంలో మరోసారి అద్భుతం ఆవిష్కృతం కానుంది. ఈ నెలలోనే సూర్యగ్రహణం వచ్చింది. ఇప్పుడు వెంటనే చంద్రగ్రహణం కూడా ఇదే నెలలో కనువిందు చేయనుంది. గ్రహణం అనేది ఆకాశంలో సూర్యుడు, చంద్రుడు, భూమి ఒకే సరళ రేఖపైకి వచ్చినప్పుడు జరిగే ఖగోళ అద్భుతం అని శాస్త్రవేత్తలు చెబుతుంటారు. కానీ.. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం గ్రహణం చెడుకు సూచనగా భావిస్తారు. ఇవి అశుభమైన ఘడియలుగా పరిగణిస్తారు. గ్రహణ సమయంలో చాలా పనులను చేయకూడదని పురోహితులు చెబుతుంటారు. అంతేకాదు.. ఆ రోజన ఆలయాలను కూడా మూసేస్తారు.

ఏడాది రెండు ఒకే నెలలో రెండు గ్రహణాలు ఏర్పడడం విశేషం. ఇప్పటికే అక్టోబర్‌ 14వ తేదీన సూర్యగ్రహణం ఏర్పడింది. ఇప్పుడు ఇదే నెలలో చంద్రగ్రహణం ఏర్పడబోతోంది. మరి, అది ఏ నెలలో ఏర్పడనుంది? మన దేశంలో చంద్ర గ్రహణం కనిపిస్తుందా? అనే విషయాలను ఇప్పుడు చూద్దాం.

Lunar Eclipse 2023 : ఈ నెలలో చంద్ర గ్రహణం.. అక్టోబర్‌ 28 (శనివారం) అర్ధరాత్రి దాటిన తర్వాత 29వ తేదీ ఆరంభం అవుతుండగా.. ఏర్పడనుంది. ఈ చంద్రగ్రహణం.. భారత్ సహా.. నేపాల్‌, శ్రీలంక, బంగ్లాదేశ్‌, చైనా, అఫ్ఘాన్ వంటి దేశాల్లో కనిపించనుంది. అయితే.. ఇప్పుడు ఏర్పడేది పాక్షిక చంద్ర గ్రహణం. భారత కాలమానం ప్రకారం ఈ చంద్రగ్రహణం.. అక్టోబర్‌ 28వ తేదీ అర్ధరాత్రి దాటిన తర్వాత 01:05 గంటలకు ప్రారంభమై.. 02:24 గంటలకు ముగుస్తుంది.

చంద్రగ్రహణం మన దేశంలో కనిపిస్తుందా?

ఈ పాక్షిక చంద్ర గ్రహాణాన్ని భారతదేశంలోని దాదాపు అన్ని ప్రాంతాల్లోనూ వీక్షించవచ్చు. చంద్రగ్రహణాన్ని ఎలాంటి ప్రత్యేక పరికరాలు అవసరం లేకుండా కూడా చూడవచ్చు. టెలిస్కోప్‌ పరికరం ఉంటే చంద్రగ్రహణ దృశ్యం మరింత స్పష్టంగా కనిపిస్తుంది.

ఈ నెల 28న పాక్షిక చంద్రగ్రహణం ఏర్పడుతుండటంతో తిరుమల శ్రీవారి ఆలయాన్ని మూసి వేయనున్నారు. పాక్షిక చంద్రగ్రహణం కారణంగా సుమారు 8 గంటల పాటు ఆలయ తలుపులు మూసి ఉంచనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) తెలిపింది. ప్రతిసారీ గ్రహణ సమయానికి 6 గంటల ముందు దేవస్థానం తలుపులు మూసివేయడం ఆనవాయితీగా వస్తోంది. పాక్షిక చంద్రగ్రహణం కారణంగా 28న రాత్రి 7.05 గంటలకు ఆలయ తలుపులు మూసి వేయనున్నారు.

చంద్రగ్రహణం అంటే ఏంటి?

చంద్రుడు, సూర్యుడి మధ్యలోకి భూమి అడ్డుగా వస్తే చంద్రగ్రహణం ఏర్పడుతుంది. ఈ సమయంలో భూమి మధ్యలో ఉంటుంది కాబట్టి.. సూర్య కిరణాలు చంద్రుడిపై ప్రసరించవు. అద్భుతమైన చంద్రగ్రహణం పౌర్ణమి రోజున మాత్రమే ఏర్పడుతుంది.

సూర్యగ్రహణం అంటే ఏమిటి?
సూర్యుడికి, భూమికి మధ్య చంద్రుడు అడ్డుగా వస్తే.. సూర్యగ్రహణం ఏర్పడుతుంది. సూర్యుడి కిరణాలు భూమిపై పడకుండా చంద్రుడు అడ్డుకుంటాడు. ఇది ఒక్క అమావాస్య రోజున మాత్రమే జరుగుతుంది.

Solar Eclipse 2023 : రేపే సూర్యగ్రహణం.. మన దేశంలో ఎక్కడ కనిపిస్తుంది?

గ్రహణం సమయంలో ఈ రాశుల వాళ్లు ఈ మంత్రం పటిస్తే శుభకరం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.