ETV Bharat / bharat

ప్రేయసిపై 20 కత్తిపోట్లు.. వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుందని.. - పునరావాస కేంద్రంలో చిత్ర హింసలు

వేరే వ్యక్తిని వివాహం చేసుకుందని ప్రేయసిపై కత్తితో దాడికి పాల్పడ్డాడు ఓ యువకుడు. బాధితురాలిని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మరణించింది. నిందితుడు కూడా విషం సేవించి ఆత్మహత్యాయత్నం చేశాడు. మరోవైపు మద్యం తాగి గొడవకు దిగుతున్నాడని భర్తను పునరావాస కేంద్ర సభ్యులతో కిడ్నాప్ చేయించి.. చిత్రహింసలకు గురి చేయించింది. కర్ణాటకలో ఈ ఘటనలు వెలుగుచూశాయి.

Lover stabbed girlfriend
ప్రేయసిని కత్తితో పొడిచిన ప్రియుడు
author img

By

Published : Sep 17, 2022, 10:06 AM IST

కర్ణాటకలో దారుణం జరిగింది. తన ప్రేయసి వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుందని యువకుడు.. ఆమెను కత్తితో 20 సార్లు పొడిచాడు. అనంతరం అతడు కూడా విషం తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. బెంగళూరు సమీపంలోని దేవనహళ్లి తాలూకా అవటి గ్రామంలో గురువారం రాత్రి ఈ ఘటన జరిగింది. ప్రేమోన్మాది దాడిలో తీవ్రంగా గాయపడిన బాధితురాలు సౌమ్య(23) ఆస్పత్రికి తరలిస్తుండగా.. మార్గమధ్యలోనే ప్రాణాలు కోల్పోయింది. విషం తాగిన నిందితుడు సుబ్రమణ్య.. దేవనహళ్లిలోని ఆకాశ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.

Lover stabbed girlfriend
ప్రేయసిని కత్తితో పొడిచిన ప్రియుడు

హత్యకు గురైన సౌమ్య, నిందితుడు సుబ్రమణ్య బెంగళూరులోని ఓ కాఫీ డేలో పనిచేసేవారు. ఆ సమయంలో వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడి.. అది కాస్త ప్రేమగా మారింది. కొన్ని నెలల క్రితం సుబ్రమణ్య ఉద్యోగం మానేశాడు. అనంతరం అతడిని సౌమ్య దూరం పెట్టింది. 15 రోజుల క్రితం సౌమ్యకు.. వేరే యువకుడితో వివాహమైంది. తాను ప్రేమించిన సౌమ్య వేరే అబ్బాయిని పెళ్లిచేసుకుందని సుబ్రమణ్య ఆమెపై పగ పెంచుకున్నాడు.

బాధితురాలు సౌమ్య తన పుట్టింటివారి ఇంటికి వచ్చిందని నిందితుడికి తెలిసింది. ఈ క్రమంలో గురువారం రాత్రి సౌమ్య ఇంటికి వెళ్లి కత్తితో 20 సార్లు పొడిచి పారిపోయాడు. సౌమ్య కేకలు విని ఇరుగుపొరుగు వారు వచ్చారు. తీవ్రంగా గాయపడిన సౌమ్యను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందింది. ఈ ఘటనపై విజయపుర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.

మద్యం తాగి వచ్చాడని..
మద్యానికి బానిసైన భర్తను పునరావాస కేంద్రం సభ్యులతో కిడ్నాప్ చేయించింది ఓ మహిళ. మూడు నెలల నుంచి పునరావాస కేంద్ర సభ్యులు బాధితుడ్ని అక్రమంగా నిర్బంధించి.. తీవ్రంగా హింసించారు. ఈ ఘటన కర్ణాటక బెంగళూరులోని కొత్తనూరు పోలీస్ స్టేషన్​ పరిధిలో జరిగింది.

అసలేం జరిగిందంటే.. కాక్స్‌టౌన్‌కు చెందిన దీపక్‌ జోసెఫ్‌కు దీపలక్ష్మితో 2021లో వివాహం జరిగింది. వీరికి నాలుగు నెలల వయసున్న కుమార్తె ఉంది. దీపక్​ మద్యం సేవించి ఇంటికి వచ్చాడు. దీంతో అతడు భార్య దీపలక్ష్మితో గొడవ పడ్డాడు. భర్తపై కోపం పెంచుకున్న దీపలక్ష్మి.. పునరావాస కేంద్రానికి ఫోన్ చేసింది. అనంతరం పునరావాస కేంద్రం సభ్యులు అతనిపై దాడి చేసి కారులో ఎత్తుకెళ్లిపోయారు. సుమారు మూడు నెలలపాటు దీపక్​ను పునరావాస కేంద్రంలో ఉంచి కర్రలతో చేతులు, కాళ్లపై దాడి చేశారు.
దీపక్​ తల్లికి ఈ విషయం తెలియడం వల్ల తన కుమారుడ్ని విడిపించింది. చికిత్స నిమిత్తం ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించింది. తన కోడలు దీపలక్ష్మి, పునరావాస కేంద్రం సభ్యులు రవీంద్ర, ఆంటోనీ సహా నలుగురిపై కొత్తనూరు పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేసింది.

ఇవీ చదవండి: 'నా భర్త మగాడు కాదు'.. పెళ్లైన 8 ఏళ్లకు మహిళ ఫిర్యాదు

షాపులో సంస్కృత పాఠాలు.. అధ్యాపకుడిగా మారిన వస్త్ర వ్యాపారి..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.