ETV Bharat / bharat

కుజ దోషం ఉందని పెళ్లికి ప్రియుడు 'నో'.. విషం తాగిన మహిళా కానిస్టేబుల్​ - విషం తాగి మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య

ప్రియురాలి జాతకంలో కుజ దోషం ఉందని పెళ్లికి నిరాకరించాడు ఓ ప్రియుడు. దీంతో విషం తాగి ప్రాణాలు కోల్పోయింది ప్రియురాలు. ఈ ఘటన కర్ణాటకలో జరిగింది.

lover suicide
మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య
author img

By

Published : Jun 17, 2022, 9:27 PM IST

Updated : Jun 17, 2022, 9:39 PM IST

కర్ణాటకలో దారుణం జరిగింది. అమ్మాయి జాతకంలో కుజ దోషం ఉందని ఆమె ప్రియుడు పెళ్లికి నిరాకరించాడు. దీంతో ఆమె విషం తాగింది. హుటాహుటిన మంగళూరులోని ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ శుక్రవారం ప్రాణాలు కోల్పోయింది. మృతురాలు సుధ.. శివమొగ్గ జిల్లా తీర్థహళ్లి పోలీస్​ స్టేషన్లో మహిళా కానిస్టేబుల్​గా విధులు నిర్వర్తిస్తోంది.

అసలేం జరిగిందంటే: ప్రవీణ్, సుధ ఆరేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. సుధ మహిళా కానిస్టేబుల్​గా, ఫారెస్ట్ రేంజ్​ ఆఫీసర్​గా ప్రవీణ్​.. విధులు నిర్వర్తిస్తున్నారు. ప్రవీణ్.. సుధ జాతకాన్ని తన తల్లికి చూపించాడు. అమ్మాయి జాతకంలో కుజ దోషం ఉందని అతని తల్లి వీరి వివాహానికి అంగీకరించలేదు. దీంతో ప్రవీణ్.. సుధతో పెళ్లికి నిరాకరించాడు. అయితే సుధ మాత్రం తనను పెళ్లి చేసుకోవాలని ప్రవీణ్​ను కోరింది.

మే 31న భద్రావతిలో విధులు నిర్వహిస్తున్న ప్రవీణ్​ను వద్దకు వెళ్లి తనను పెళ్లి చేసుకోవాలని సుధ డిమాండ్​ చేసింది. అయినా పెళ్లికి ప్రవీణ్ అంగీకరించలేదు. దీంతో ఇద్దరు కలిసి చనిపోవాలని నిర్ణయించుకున్నారు. అనంతరం భద్రావతి ఏపీఎంసీ ఆవరణకు వచ్చి విషం తాగేయాలని అనుకున్నారు. మొదట సుధనే విషం తాగమన్నాడు ప్రవీణ్​. ఆ తర్వాత అతను విషం తీసుకోలేదని తెలుస్తోంది. అయితే ఇద్దరిని శివమొగ్గలోని మెక్‌గన్ ఆసుపత్రిలో చేర్చారు. అనంతరం సుధను మెరుగైన చికిత్స కోసం మంగళూరులోని ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న సమయంలో కానిస్టేబుల్ సుధ పోలీసులకు ఫిర్యాదులో అన్ని విషయాలు చెప్పింది. భద్రావతి ఓల్డ్ సిటీ పోలీస్​ స్టేషన్​లో ప్రవీణ్​పై కేసు నమోదైంది.

ఇవీ చదవండి: చెట్టుకు ఉరి వేసుకున్న తండ్రీకూతుళ్లు.. ఏమైంది?

సంపదలో భాజపానే టాప్​.. తరువాతి స్థానాల్లో ఎవరంటే?

Last Updated : Jun 17, 2022, 9:39 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.