ETV Bharat / bharat

ప్రేయసికి లవ్​ లెటర్ ఇద్దామని పొరపాటున పక్కింట్లోకి.. పారిపోతూ నీటి ట్యాంక్​లో.. - బిహార్ రోహ్తాస్​ క్రైం

లవ్ లెటర్ ఇచ్చేందుకు ప్రియురాలి ఇల్లు అనుకుని పొరపాటున పక్కింట్లోకి వెళ్లిపోయాడు ఓ యువకుడు. ఆ కుటుంబ యజమాని యువకుడ్ని పట్టుకుని చితకబాదాడు. ఈ ఘటన బిహార్​లో జరిగింది.

Lover Beating In Rohtas
యువకుడిని కర్రలతో చితకబాదిన గ్రామస్థులు
author img

By

Published : Jul 11, 2022, 10:45 AM IST

ప్రియురాలికి లవ్​ లెటర్ ఇచ్చేందుకు వెళ్లిన యువకుడు

ప్రియురాలికి లవ్ లెటర్ ఇచ్చేందుకు వెళ్లిన ఓ యువకుడు.. పొరపాటున పక్కింట్లోకి దూరాడు. యజమాని రాకను గమనించిన ఆ యువకుడు అక్కడి నుంచి పారిపోయేందుకు డాబా మీదకు పరిగెత్తాడు. డాబాపై ఉన్న వాటర్ ట్యాంక్​లో దాక్కొన్నాడు. ఇన్ని తంటాలు పడ్డా.. చివరకు యజమానికి పట్టుబడ్డాడు. బిహార్‌.. రోహ్తాస్‌లోని బిక్రమ్​గంజ్​ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం రాత్రి ఈ ఘటన జరిగింది. యువకుడిని పట్టుకొని స్థానికులు చితకబాదారు. కర్రలతో తీవ్రంగా కొట్టారు.

అనంతరం యువకుడిని పోలీసులకు అప్పగించారు. నిందితుడు వర్నా గ్రామానికి చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. మొదట పక్కింట్లోని అమ్మాయికి లెటర్ ఇవ్వడానికి వచ్చానని యువకుడు చెప్పాడు. కానీ, పొరపాటున ఈ ఇంట్లోకి ప్రవేశించానని పోలీసులకు తెలిపాడు. అందువల్లే భయంతో పారిపోయానని వెల్లడించాడు.

ఇదీ చదవండి: దక్షిణాదిపై భాజపా గురి.. '2024' కోసం పక్కా ప్లాన్​తో..

25ఏళ్లకు కలిసిన తండ్రీకొడుకులు.. చనిపోయాడని ఇంతకాలంగా..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.