ETV Bharat / bharat

ప్రియుడి మర్మాంగం కోసిన యువతి.. హోటల్​కు పిలిచి, ఏకాంతంగా ఉండగా.. - ప్రియుడి మర్మాంగం కోసిన లవర్​

Lover Cut Boyfriend Private Parts : తన ప్రియుడు వేరే పెళ్లి చేసుకోబోతున్నాడని మనస్తాపానికి గురైన ప్రియురాలు అతడి మర్మాంగాన్ని కోసేసింది. బాధితుడి ఆర్తనాదాలు విన్న స్థానికులు అతడిని ఆస్పత్రికి తరలించారు. నిందితురాలిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ దారుణ ఘటన బిహార్​లో జరిగింది.

Lover Cut Boyfriend Private Parts
Lover Cut Boyfriend Private Parts
author img

By

Published : Jun 8, 2023, 5:54 PM IST

Updated : Jun 8, 2023, 6:41 PM IST

Lover Cut Boyfriend Private Parts : బిహార్​లో దారుణం జరిగింది. ప్రియుడి మర్మాంగాన్ని కోసింది ఓ ప్రియురాలు. తన బాయ్​ఫ్రెండ్​ వేరే పెళ్లి చేసుకోబోతున్నాడని మనస్తాపానికి గురైన నిందితురాలు.. బాధితుడిపై ఇలా దాడికి పాల్పడింది. ఈ ఘటన పట్నాలో జరిగింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాధితుడు పట్నాలోని శివహార్​ ప్రాంతంలో నివసిస్తున్నాడు. ఛత్తీస్​గఢ్​లో సీఆర్​పీఎఫ్​ జవాన్​గా విధులు నిర్వహిస్తున్నాడు. తన చుట్టాల అమ్మాయి అయిన నిందితురాలు పట్నాలో చదువుకుంటోంది. వీరిద్దరికి పరిచయం ఏర్పడి మూడేళ్లుగా రిలేషన్​షిప్​లో ఉన్నారు.

ఇటీవలే వీరిద్దరూ రహస్యంగా పెళ్లి చేసుకున్నారు. అనంతరం ఎవరి పనుల్లో వారు బిజీ అయిపోయారు. ఈ క్రమంలో తన ప్రేమికుడికి జూన్​ 23న మళ్లీ పెళ్లి జరగబోతుందన్న విషయం ప్రియురాలికి తెలిసింది. దీంతో మనస్తాపానికి గురైన ఆమె.. ఛత్తీస్​గఢ్​లో ఉన్న బాయ్​ఫ్రెండ్​కు ఫోన్​ చేసి పట్నాకు రమ్మని చెప్పింది. లేకపోతే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించింది.

పట్నా వచ్చిన బాధితుడు ఓ హోటల్​లో ప్రియురాలిని కలిశాడు. అతడు వేరే పెళ్లి చేసుకోవడం తనకు ఇష్టం లేదని బాయ్​ఫ్రెండ్​కు ప్రియురాలు చెప్పింది. ఆ తర్వాత అతడికి నచ్చజెప్పే ప్రయత్నం చేసింది. అనంతరం ఇద్దరూ ఏకాంతంగా ఉన్న సమయంలో బ్యాగ్​లోంచి పదునైన ఆయుధం తీసి.. ప్రియుడి మర్మాంగాన్ని కోసింది. బాధితుడి ప్రైవేటు పార్ట్​ 60 శాతం తెగడం వల్ల.. గట్టిగా ఆర్తనాదాలు చేశాడు. దీంతో ఘటనా స్థలానికి వచ్చిన స్థానికులు పరిస్థితి విషమంగా ఉన్న బాధితుడిని ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న గాంధీ మైదాన్​ పోలీసులు నిందితురాలిని అరెస్టు చేశారు. ప్రస్తుతం బాధితుడు చికిత్స పొందతున్నాడని పట్నా నగర ఎస్​పీ వైభవ్​ శర్మ తెలిపారు.

యువతిపై స్నేహితుల గ్యాంగ్​ రేప్​..
ఓ కళాశాల విద్యార్థిపై తన ఇద్దరు స్నేహితులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన బంగాల్​లోని డార్జిలింగ్​లో జరిగింది. బాధితురాలు, తన స్నేహితులు మతిగర పోలీస్​ స్టేషన్​ పరిధిలోని సిముల్తాలా టీ ఎస్టేట్​​ నివాసితులు. బాధితురాలికి నిందితులతో చాలా కాలంగా పరిచయం ఉంది. బుధవారం యువతి కళాశాల నుంచి ఇంటికి తిరిగివస్తున్న సమయంలో.. నిందితులు ఆమెను కలిశారు. రెస్టారెంట్​లో భోజనం చేద్దామని యువతిని ఒప్పించి దగ్గర్లోని సిముల్తాలా టీ తోటకు తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. దీంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితులు నీలోయ్ సర్కార్, ఆకాష్ మోండల్​ను అదుపులోకి తీసుకున్నామని, తదుపరి విచారణ కొనసాగుతోందని సిలిగుడి పోలీస్​ కమిషనర్​ అఖిలేశ్​ చతుర్వేది తెలిపారు. నిందితులను సిలిగుడి సబ్​​ డివిజనల్​ కోర్టు 14 రోజుల జుడీషియల్​ కస్టడీకి అప్పగించింది. బాధితురాలిని వైద్యపరీక్షల నిమిత్తం ఉత్తర బంగాల్​ మెడికల్​ కాలేజీ ఆస్పత్రికి తరలించారు.

సెప్టిక్​ ట్యాంక్​లో అస్థిపంజరం.. వివాహేతర సంబంధమే కారణం
తమిళనాడు తెన్కాసి జిల్లాలో ఓ వ్యక్తి ఇంట్లో మెయింటెనెన్స్​ పనులు జరుగుతుండగా.. సెప్టిక్​ ట్యాంక్​లో గత ఆదివారం అస్థిపంజరం బయటపడింది. ఈ ఘటనలో ముగ్గురిని పోలీసులు అరెస్ట్​ చేసి విచారించగా దారుణ విషయాలు వెలుగులోకి వచ్చాయి. కొద్ది రోజులు క్రితం మధు అనే కాలేజీ విద్యార్థి అదృశ్యమయ్యాడు. అంతకుముందు అతడి ఎదురింట్లో ఉన్న పెళ్లైన మహిళతో మధుకు వివాహేతర సంబంధం ఏర్పడింది. తరచూ ఏకాంతంగా కలుసుకునేవారు. ఈ క్రమంలో ఏకాంత సమయంలో తీసిన వీడియో చూపించి వివాహితను బ్లాక్​మెయిల్ చేశాడు మధు. దీంతో ఓ రోజు మధును ఆహ్వానించి ఏకాంత సమయంలో అతడి కాళ్లు, చేతులు కట్టేసింది. దీనికి మధు ఒప్పుకున్నాడు. అనతరం మధును దిండుతో ఊపిరాడకుండా చేసి చంపేసింది. అనంతరం తన తల్లి, సోదరుడు సహాయంతో సెప్టిక్​ ట్యాంక్​లో మృతదేహాన్ని పడేసింది.

college student died illicit affairs tamilnadu
కాలేజీ విద్యార్థి మధును చంపిన నిందితులు

Last Updated : Jun 8, 2023, 6:41 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.