ETV Bharat / bharat

'ఆ సమయంలో లౌడ్​స్పీకర్లలో హనుమాన్​ చాలీసా బంద్​'

Loudspeakers Maharashtra: మసీదులకు సమీపంలో నమాజ్​ సమయంలో లౌడ్​స్పీకర్లలో హనుమాన్​ చాలీసా, భజనలు ప్లే చేయటాన్ని నిషేధించారు మహారాష్ట్రలోని నాశిక్​ పోలీసులు. ఆజాన్​కు 15 నిమిషాల ముందు నుంచి ఆ తర్వాత 15 నిమిషాల వరకు ఆంక్షలు ఉంటాయని స్పష్టం చేశారు. మరోవైపు.. రాష్ట్రవ్యాప్తంగా బహిరంగ ప్రదేశాల్లో స్పీకర్ల ఏర్పాటుపై రెండ్రోజుల్లో మార్గదర్శకాలు విడుదల చేస్తామని హోంమంత్రి దిలీప్​ వాల్షే తెలిపారు.

loudspeakers maharashtra
లౌడ్​స్పీకర్లలో హనుమాన్​ చాలీసా
author img

By

Published : Apr 18, 2022, 7:23 PM IST

Loudspeakers Maharashtra: మతపరమైన ప్రార్థనల సమయంలో లౌడ్​స్పీకర్లు పెట్టటం వల్ల గందరగోళం నెలకొని శాంతిభద్రతల సమస్య తలెత్తే అవకాశం ఉందంటూ మహారాష్ట్రలోని నాశిక్​​ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ముస్లింలు ప్రార్థన చేసే సమయం ఆజాన్​(నమాజ్​)కు 15 నిమిషాల ముందు నుంచి నమాజ్​ తర్వాత 15 నిమిషాల వరకు హనుమాన్​ చాలీసా, భజన వంటివి లౌడ్​స్పీకర్లలో ప్లే చేయకూడదని ఆదేశించారు. స్పీకర్లు పెట్టేందుకు తప్పనిసరిగా అనుమతులు తీసుకోవాలని సిటీ పోలీస్​ కమిషనరేట్​ ఆదేశాలు జారీ చేసింది.

"హనుమాన్​ చాలీసా, భజనలు స్పీకర్లలో ప్లే చేసేందుకు అనుమతులు తీసుకోవాలి. ఆజాన్​కు 15 నిమిషాల ముందు నుంచి ఆ తర్వాత 15 నిమిషాల వరకు ఎలాంటి అనుమతులు లేవు. అలాగే.. మసీదుకు 100 మీటర్ల పరిధిలో స్పీకర్లకు అనుమతి లేదు. శాంతిభద్రతలను కాపాడేందుకే ఈ నిర్ణయం తీసుకున్నాం."

- దీపక్​ పాండే, సీపీ, నాశిక్​.

మే 3లోపు అన్ని మతపరమైన ప్రాంతాల్లో లౌడ్​స్పీకర్లు పెట్టుకునేందుకు అనుమతి తీసుకోవాలని స్పష్టం చేశారు సీపీ. మే 3 తర్వాత ఎవరైనా అనుమతి లేకుండా స్పీకర్లు పెట్టి నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. అలా చేస్తే 6 నెలల వరకు జైలు శిక్ష పడుతుందని హెచ్చరించారు. మరోవైపు.. నమాజ్​ కోసం మసీదుల్లో లౌడ్​స్పీకర్లును తొలగించకపోతే.. తాము హనుమాన్​ చాలీసా, భజనలతో లౌడ్​స్పీకర్లు ఏర్పాటు చేస్తామని మహారాష్ట్ర నవనిర్మాణ్​​ సేన(ఎంఎన్​ఎస్​) అధినేత రాజ్​ ఠాక్రే హెచ్చరించిన కొద్ది గంటల్లోనే పోలీసులు ఈ నిర్ణయం తీసుకోవటం ప్రాధాన్యం సంతరించుకుంది. ఆదేశాలు జారీ చేసిన కొద్దిసేపటికే మసీదు సమీపంలో లౌడ్​స్పీకర్​లో హనుమాన్​ చాలీసా పెట్టి నిబంధనలు ఉల్లంఘించారనే కారణంగా ఎంఎన్​ఎస్​ నాయకుడు మహేంద్ర భనుశాలిని అరెస్ట్​ చేశారు పోలీసులు.

రెండ్రోజుల్లో కొత్త మార్గదర్శకాలు: రాష్ట్రవ్యాప్తంగా బహిరంగ ప్రదేశాల్లో లౌడ్​స్పీకర్లను ఉపయోగించే విషయంపై రాష్ట్ర డీజీపీ, ముంబయి పోలీస్​ కమిషనర్​ మార్గదర్శకాలను రూపొందిస్తున్నారని.. రెండ్రోజుల్లో విడుదల చేస్తామని రాష్ట్ర హోంమంత్రి దిలీప్​ వాల్షే తెలిపారు. లౌడ్​స్పీకర్ల విషయంపై ఓ నిర్ణయం తీసుకునేందుకు సీఎం ఉద్ధవ్​ ఠాక్రే, హోంమంత్రి దిలీప్​ వాల్షే పలుమార్లు సమావేశమై చర్చించారు. కోర్టు ఆదేశాల ప్రకారం రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు స్పీకర్లు పెట్టకూడదని, ఆ నిబంధనలకు కట్టుబడి ఉండాలని అధికారులు కోరారు.

ఇదీ చూడండి: దిల్లీలో మళ్లీ ఉద్రిక్తత.. విచారణకు వెళ్లిన పోలీసులపై రాళ్ల దాడి

మోదీ నయా ట్రెండ్.. గురువారం ఎర్రకోట నుంచి ప్రసంగం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.