ETV Bharat / bharat

సైబర్​ భద్రతకు త్వరలోనే నయా అస్త్రం! - లెఫ్టినెంట్​ జనరల్​ రాజేశ్​ పంత్

అంతర్జాల వినియోగం పెరిగిపోతున్న ప్రస్తుత సమయంలో సైబర్​ నేరాలూ అధికమయ్యాయి. ఇటీవల భారత సంస్థలపై చైనా సైబర్​ దాడులకు పాల్పడినట్లు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో చాలా కాలంగా పెండింగ్​లో ఉన్న 'జాతీయ సైబర్​ భద్రతా వ్యూహం' అమలులోకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం సన్నద్ధమైంది. కొద్ది రోజుల్లోనే అందుబాటులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

National cyber security strategy
'సైబర్​ భద్రతా వ్యూహం'తో అంతర్జాల నేరాలకు చెక్​!
author img

By

Published : Mar 2, 2021, 4:05 PM IST

ఇటీవలి కాలంలో సైబర్​ దాడులు పెరిగిపోయాయి. రోజు రోజుకు వాటి నుంచి ముప్పు అధికమవుతోంది. ఈ క్రమంలో సైబర్​ దాడులను అరికట్టేందుకు భారత్​లో దీర్ఘకాలంగా పెండింగ్​లో ఉన్న 'జాతీయ సైబర్​ భద్రతా వ్యూహం'(ఎన్​సీఎస్​ఎస్​)ను కొద్ది రోజుల్లోనే అమలులోకి తీసుకొచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇటీవల భారత్​లోని విద్యుత్తు రంగ సంస్థలపై చైనా ఆధారిత సంస్థలు సైబర్​ దాడులు చేశాయన్న వార్తల నేపథ్యంలో.. భారత సైబర్​ భద్రతా విధానాన్ని సత్వరమే అమలు చేయాల్సిన ఆవశ్యకత ఏర్పడింది.

ఈ విషయంపై ఈటీవీ భారత్​తో మాట్లాడారు భారత జాతీయ సైబర్​ భద్రతా కోఆర్డినేటర్, లెఫ్టినెంట్​ జనరల్​ రాజేశ్​ పంత్​.

" మన కొత్త వ్యూహం ఎన్​సీఎస్ఎస్​ త్వరలోనే అమలులోకి రానుంది. పూర్తి వ్యవస్థను ఏ విధంగా రక్షించుకోవచ్చు అనేది ఇందులో పొందుపరిచాం. కొత్త వ్యూహంపై అన్ని పనులు పూర్తయ్యాయి. కేంద్ర మంత్రివర్గ ఆమోదం కోసం పంపించాం. నెల లేదా రెండు నెలల్లో అమలులోకి వస్తుంది.

అంతర్జాల ఆధారిత కంప్యూటర్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. పలు లింకులపై క్లిక్​ చేసేలా సైబర్​ నేరగాళ్లు ఉచ్చు పన్నుతారు. వాటిని క్లిక్ చేస్తే మాల్​వేర్​ కంప్యూటర్​లోకి చేరుతుంది. అక్కడి నుంచి ఇతర కంప్యూటర్లలోకి వెళుతుంది. అడ్మిన్​ వివరాలను సేకరించేందుకు ప్రయత్నిస్తుంది. కానీ, ఆపరేటింగ్​ సిస్టమ్స్​ను హ్యాక్​ చేయలేదు. ఐటీపై అధికంగా ఆధారపడుతున్నందున భారత్​లోని ప్రతి రంగం సైబర్​ సెక్యూరిటీ కేంద్రాన్ని కలిగి ఉండాలి."

- లెఫ్టినెంట్​ జనరల్​ రాజేశ్​ పంత్​, జాతీయ సైబర్​ భద్రతా కోఆర్డినేటర్​ ​

భారత్​-చైనా మధ్య సరిహద్దు ప్రతిష్టంభన నెలకొన్న వేళ భారత్​లోని సంస్థలపై చైనాకు చెందిన సంస్థలు సైబర్​ దాడులకు పాల్పడుతున్నట్లు వచ్చిన నివేదికలు.. అప్రమత్తమవ్వాల్సిన ఆవశ్యకతను పెంచాయి. అయితే.. పలు దఫాల చర్చల ఫలితంగా ప్రస్తుతం బలగాల ఉపసంహరణ కొనసాగుతున్న క్రమంలో కాస్త ఊరట లభించినట్లయింది.

గత ఏడాది హార్వర్డ్​ కెన్నెడీ స్కూల్​ విడుదల చేసిన ప్రపంచ సైబర్​ పవర్​ నివేదికలో భారత్​ 21వ స్థానానికి పరిమితమైంది. మరోవైపు.. అమెరికా నేతృత్వంలోని జాతీయ సైబర్​ పవర్​ సూచీ(ఎన్​సీపీఐ)లో చైనా.. సైబర్​ భద్రతలో రెండో బలమైన దేశంగా నిలిచింది. ఆ తర్వాత బ్రిటన్​, రష్యా, నెదర్లాండ్స్​, ఫ్రాన్స్​, జర్మనీ, కెనడా, జపాన్​, ఆస్ట్రేలియా ఉన్నాయి. 30 దేశాల్లోని సైబర్​ భద్రతా సామర్థ్యంపై అధ్యయనం చేసి నివేదిక రూపొందించారు. ఇందులో ప్రధానంగా దేశీయ సంస్థలపై నిఘా, పర్యవేక్షణ, జాతీయ సైబర్​ భద్రతా, వాటి సామర్థ్యం పెంపు, జాతీయ భద్రత కోసం విదేశీ ఇంటెలిజెన్స్ డేటా సేకరణ వంటి కీలక అంశాలను పరిగణనలోకి తీసుకున్నారు.

ఇదీ చూడండి: సైబర్​ దాడుల బాధితుల్లో భారత్​కు రెండోస్థానం​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.