lokayukta inspector unnatural sex: ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి ఓ యువకుడిపై అసహజ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు ఓ పోలీస్ ఇన్స్పెక్టర్. నిందితుడు సురేంద్ర యాదవ్ మధ్యప్రదేశ్ గ్వాలియర్‌లోని లోకాయుక్త బ్రాంచ్‌లో పనిచేస్తున్నాడని అధికారులు తెలిపారు. బాధిత యువకుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. నిందితుడు పరారయ్యాడని వివరించారు.
ఏమైందంటే..?
Madhya pradesh crime news: గ్వాలియర్ క్రైమ్ బ్రాంచ్ ఏఎస్పీ రాజేశ్ దండోతియా వెల్లడించిన వివరాల ప్రకారం... 32 ఏళ్ల ఓ వ్యక్తి.. 2021 నుంచి ఉద్యోగ వేటలో ఉన్నాడు. ఈ క్రమంలోనే ఇన్స్పెక్టర్ సురేంద్ర యాదవ్‌ను సంప్రదించాడు. గ్వాలియర్‌లోని ప్రభుత్వ కార్యాలయాల్లో ఏదైనా ఉద్యోగం ఇప్పించాలని కోరాడు. యువకుడి ఫోన్ నెంబర్ తీసుకున్న ఇన్స్పెక్టర్ సురేంద్ర.. కొద్దిరోజుల తర్వాత నగరంలోని ల్యాండ్‌మార్క్ హోటల్‌కు పిలిచాడు. యువకుడు కలిసేందుకు హోటల్‌కు వెళ్లిన సమయంలో ఇన్స్పెక్టర్ అనుచితంగా ప్రవర్తించాడు. ఒంటరిగా రూమ్‌లో ఎదురుచూసిన సురేంద్ర.. యువకుడు రాగానే అతడిని శారీరకంగా వేధించాడు.
6 నెలల నుంచి ఇలా అతడిపై వేధింపులను కొనసాగించాడు ఇన్స్పెక్టర్. ఉద్యోగం ఇప్పిస్తాడనే ఆశతో వాటన్నింటినీ భరించాడు అతడు. అయితే, విసుగు చెందిన యువకుడు ఎలాగైనా ఇన్స్పెక్టర్ బారి నుంచి తప్పించుకోవాలని అనుకున్నాడు. పోలీసు శాఖలో పనిచేస్తున్నాడు కాబట్టి తనపై ప్రతీకారం తీర్చుకుంటాడేమోనని భయపడి.. ముందుగానే ఆధారాలు సేకరించాలని నిర్ణయించుకున్నాడు. ఓ రోజు ఇన్స్పెక్టర్ దగ్గరికి వెళ్లినప్పుడు.. తన స్నేహితుడి సాయంతో రహస్యంగా వీడియో తీయించాడు. అలా ఇన్స్పెక్టర్ నగ్నంగా ఉన్న వీడియోను సంపాదించాడు. దీని ఆధారంగా ఫిర్యాదు చేశాడు. వీడియోను చూసి పోలీసులే నివ్వెరపోయారు. కేసు నమోదు చేసిన తర్వాత లోకాయుక్త ఇన్స్పెక్టర్ సురేంద్ర పారిపోయాడు. ఈ ఘటనపై ప్రస్తుతం విచారణ కొనసాగిస్తున్నామని పోలీసులు స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: రానా పెద్ద మనసు.. ఉక్రెయిన్ కోసం రూ.40 కోట్ల సాయం!