ETV Bharat / bharat

వివాదాస్పద 'దిల్లీ' బిల్లుకు లోక్​సభ ఆమోదం - national capital billl in loksabha

విపక్షాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైనప్పటికీ.. 'దిల్లీ' బిల్లు లోక్​సభలో ఆమోదం పొందింది. ఈ బిల్లు ప్రకారం దిల్లీ ప్రభుత్వమంటే.. లెఫ్టినెంట్‌ గవర్నర్‌ అని, కార్యనిర్వహణకు సంబంధించి దిల్లీ ప్రభుత్వం తప్పనిసరిగా ఆయన అభిప్రాయం తీసుకోవాలని పొందుపరిచారు. అయితే.. దిల్లీ ప్రభుత్వం నుంచి అధికారాన్ని లాక్కునేందుకు ఈ బిల్లును తీసుకువచ్చారని ఆమ్​ ఆద్మీ పార్టీ ఆరోపించింది. ఈ బిల్లు రాజ్యాంగ విరుద్ధ చర్య అని కాంగ్రెస్​ విమర్శించింది.

Lok Sabha passes bill that seeks to clarify that 'govt' in Delhi means 'L-G'
లోక్​సభలో 'దిల్లీ' బిల్లు ఆమోదం
author img

By

Published : Mar 22, 2021, 8:08 PM IST

ఆమ్‌ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్‌ అభ్యంతరాల మధ్య వివాదాస్పద 'గవర్నమెంట్ ఆఫ్​ నేషనల్​ క్యాపిటల్​ టెర్రిటరీ ఆఫ్ దిల్లీ(జీఎన్​సీటీడీ)-సవరణ బిల్లు'కు లోక్‌సభ ఆమోదం తెలిపింది. దిల్లీలో ప్రభుత్వం అంటే లెఫ్టినెంట్‌ గవర్నరే అని ఈ ​బిల్లులో పేర్కొన్నారు.

జీఎన్​సీటీడీ బిల్లును లోక్​సభలో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జి.కిషన్​ రెడ్డి ప్రవేశపెట్టారు. దిల్లీ ప్రభుత్వ విధుల్లో.. వివిధ అంశాల్లో సందిగ్ధత, కోర్టులో పలు కేసులు పెండింగ్​లో ఉన్న నేపథ్యంలో ఈ బిల్లును తీసుకురావడం అనివార్యమైందని పేర్కొన్నారు. దీనిని రాజకీయ బిల్లుగా పిలవవద్దని విపక్షాలను ఆయన కోరారు.

ఏంటి ఈ 'దిల్లీ' బిల్లు..?

ఈ బిల్లు ప్రకారం దిల్లీ ప్రభుత్వం అంటే లెఫ్టినెంట్​ గవర్నర్​ ప్రభుత్వం అని అర్థం వస్తుంది. దిల్లీ ప్రభుత్వం ఏదైనా చర్యలకు ఉపక్రమించినప్పుడు లెఫ్టినెంట్​ గవర్నర్​ అభిప్రాయాన్ని తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది.

వ్యతిరేకించిన కాంగ్రెస్​, ఆప్​

ఈ బిల్లును దిల్లీలోని అధికార ఆమ్​ ఆద్మీ పార్టీ(ఆప్​) తీవ్రంగా వ్యతిరేకించింది. రాష్ట్రాల హక్కులను కాలరాయడంలో కేంద్ర ప్రభుత్వానికి చాలా అనుభవం ఉందని ఆప్​ సభ్యుడు భగవాన్​ మన్​ అన్నారు. ఈ బిల్లుపై జరిగిన చర్చలో పాల్గొన్న కాంగ్రెస్​ ఎంపీ మనీష్​ తివారీ.. దీనిని రాజ్యాంగ విరుద్ధ చర్యగా పేర్కొన్నారు. దిల్లీ ప్రభుత్వ హక్కులను లాక్కునేందుకు ఈ బిల్లును తీసుకువచ్చారని ఆరోపించారు.

అయితే.. 1996 నుంచి కేంద్రం, దిల్లీ ప్రభుత్వం వద్ద ఉన్న విభేదాలు ఈ బిల్లు ద్వారా అంతమవుతాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు.

"జీఎన్​సీటీడీ చట్టాన్ని 1991లో కాంగ్రెస్​ ప్రభుత్వమే తీసుకువచ్చింది. దాంతో తక్కువ శాసన అధికారాలు ఇస్తూ.. దిల్లీని కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చారు. మేము దిల్లీ ప్రభుత్వం నుంచి ఎలాంటి అధికారాలను లాక్కోవడమో, ఇవ్వడమో చేయటం లేదు. ఈ బిల్లు ద్వారా 1996 నుంచి కేంద్రం, దిల్లీ ప్రభుత్వం మధ్య ఉన్న విభేదాలు సమసిపోతాయి."

- జి. కిషన్​ రెడ్డి, హోంశాఖ సహాయ మంత్రి

"దేశ రాజధాని ప్రజలను కేంద్రం అవమానపర్చడానికి ఈ బిల్లును తీసుకువచ్చింది. ఈ బిల్లు ద్వారా దిల్లీ ప్రజలు ఓట్లు వేసి గెలిపించిన వారి దగ్గరి నుంచి అధికారాన్ని ఓడిపోయిన వారు లాక్కంటున్నారు." అని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్​ కేజ్రీవాల్​.. ట్విట్టర్​ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.