పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో రెండోరోజూ లోక్సభ ఎలాంటి కార్యకలాపాలు సాగకుండానే వాయిదా పడింది. పెగాసస్ వ్యవహారంపై చర్చకు పట్టుబడుతూ విపక్షాలు ఆందోళన చేశారు. దీంతో సభ ప్రారంభమైన నిమిషాల వ్యవధిలోనే వాయిదా పడింది.
లోక్సభలో స్పీకర్ వెల్లోకి దూసుకెళ్లి ప్లకార్డులు ప్రదర్శించారు విపక్ష సభ్యులు. చర్చకు సహకరించాలని స్పీకర్ ఓంబిర్లా వారించినప్పటికీ పరిస్థితి మారకపోవడం వల్ల.. సభను మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేస్తున్నట్లు తెలిపారు. వాయిదా అనంతరం తిరిగి ప్రారంభమైన లోక్సభలో విపక్ష సభ్యులు ఆందోళనలు కొనసాగించారు. దీంతో సభను మరోసారి మధ్యాహ్నం 3 గంటలకు వాయిదా వేశారు స్పీకర్.
లోక్సభ తిరిగి 3 గంటలకు ప్రారంభమవగా.. అప్పుడు కూడా విపక్షాలు ఆందోళన కొనసాగించారు. దీంతో సభను జులై 22కు వాయిదా వేశారు స్పీకర్.
ఇదీ చూడండి: 'కాంగ్రెస్ అసత్యాలను వాస్తవాలతో తిప్పికొట్టండి'