రాష్ట్రంలో విధించిన లాక్డౌన్ తరహా ఆంక్షలను వచ్చే నెల 1 ఉదయం 7 గంటల వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది మహారాష్ట్ర ప్రభుత్వం. ఇప్పటివరకు అమలులో ఉన్న ఆంక్షలతో పాటు అదనపు నిబంధనలు తీసుకొచ్చింది. ఈ మేరకు ముఖ్య కార్యదర్శి సీతారామ్ కుంతే ఆదేశాలు జారీ చేశారు.
అదనపు ఆంక్షలు...
- ఆర్టీ-పీసీఆర్ పరీక్షలో నెగెటివ్ రిపోర్టు ఉంటేనే ప్రజలకు రాష్ట్రంలోకి అనుమతి
- రాష్ట్రంలోకి వచ్చే 48 గంటల ముందు పరీక్షకు సంబంధించిన రిపోర్టు ఉండాలి
- సరకు రవాణాకు.. ఒక వాహనంలో ఇద్దరికి మాత్రమే అనుమతి
- ఇతర రాష్ట్రాల నుంచి సరకు రవాణా కోసం వచ్చిన వారికి ఆర్టీ-పీసీఆర్ పరీక్షలో నెగెటివ్ రిపోర్టు కచ్చితంగా ఉండాలి. ఇది ఏడు రోజుల పాటు చెల్లుతుంది.
కరోనాతో దేశంలో అత్యధికంగా ప్రభావితమైన రాష్ట్రం మహారాష్ట్ర. కరోనా రెండో దశతో పరిస్థితులు మరింత దారుణంగా మారాయి. ఈ నేపథ్యంల కరోనా కట్టడికి ఏప్రిల్ 5 లాక్డౌన్ తరహా ఆంక్షలను విధించింది ప్రభుత్వం. ఇప్పటివరకు ఆంక్షలను పొడిగిస్తూ వస్తోంది.
ఇదీ చదవండి: 'వ్యాక్సిన్లతో పాటు ప్రధాని కూడా కనపడట్లేదు'