ETV Bharat / bharat

'నిబంధనలు పాటించకపోతే మళ్లీ లాక్​డౌన్​'

కొవిడ్​ నిబంధనలను మహారాష్ట్ర ప్రజలు పాటిస్తారని నమ్ముతున్నానని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్​ ఠాక్రే తెలిపారు. ఒకవేళ పాటించకపోతే తమ వద్ద లాక్​డౌన్​ అస్త్రం​ ఉందని చెప్పారు. ఎలాంటి భయం లేకుండా అందరూ టీకా వేయించుకోవాలని కోరారు.

Lockdown is an option, says Maha CM
'నిబంధనలు పాటించకపోతే.. లాక్​డౌన్​'
author img

By

Published : Mar 19, 2021, 6:22 PM IST

Updated : Mar 19, 2021, 6:40 PM IST

ప్రజలు తమంతట తాముగా కొవిడ్​ నిబంధనలు పాటిస్తారని నమ్ముతున్నానని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్​ ఠాక్రే అన్నారు. లేదంటే.. భవిష్యత్​లో లాక్​డౌన్​ విధిస్తామని హెచ్చరించారు. ఆ రాష్ట్రంలో కరోనా రోజువారి కేసుల్లో గణనీయమైన పెరుగుదల కనిపిస్తున్న నేపథ్యంలో.. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. కరోనా కట్టడికి నూతన ఆంక్షలు విధిస్తున్నట్లు తెలిపారు.

"లాక్​డౌన్​ అనే ఆప్షన్​ మనకు ఉంది. కానీ, కొవిడ్​ నిబంధనలను ప్రజలు పాటిస్తారని నమ్ముతున్నాను. గతేడాది మహమ్మారి ప్రారంభమైనప్పటికీ.. వైరస్​ను ఎదుర్కోవడానికి మన దగ్గర ఏమీ లేదు. కానీ ఇప్పుడు మనకు టీకాలు ఉన్నాయి. అందరూ టీకా వేసుకుంటేనే కరోనాను తరిమిగొట్టగలం."

-ఉద్ధవ్​ ఠాక్రే, మహారాష్ట్ర ముఖ్యమంత్రి.

వ్యాక్సిన్​ సరఫరాలో ఎలాంటి కొరత లేదని కేంద్రం భరోసా ఇచ్చిందని ఠాక్రే అన్నారు. ప్రజలు ఎలాంటి భయం లేకుండా టీకా​ వేయించుకోవాలని కోరారు.

మహారాష్ట్రలో కరోనా 2.0 తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. గురువారం 25వేల 833మందికి వైరస్​ సోకినట్టు తేలగా.. మహమ్మారి విజృంభించిన నాటి నుంచి.. ఆ రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన కేసుల్లో ఇవే అత్యధికం కావడం గమనార్హం.

ఇదీ చూడండి:కొవిడ్ విజృంభణ-కొత్తగా 40వేల కేసులు

Last Updated : Mar 19, 2021, 6:40 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.