కర్ణాటకలో జరిగిన ఓ వివాహ వేడుకలో అరుదైన ఘటన జరిగింది. కుమార్తె పెళ్లికి తండ్రే పురోహితుడయ్యారు.
రాయచూర్ జిల్లా సింధనూరు తాలుకాలోని పోథ్నాల్ గ్రామంలో మల్లయ్య స్వామి.. తన కుమార్తెకు వివాహం చేయాలని నిశ్చయించారు. కర్ణాటకలో లాక్డౌన్ విధించిన కారణంగా పెళ్లికి బయటి పురోహితులెవ్వరూ రాలేకపోయారు. ఈ నేపథ్యంలో వధువు తండ్రే పురోహితుడిగా వ్యవహరించారు. ఆచార, సంప్రదాయాలతో స్వయంగా తానే దగ్గరుండి ఆయన కూతురితో పాటు బంధువుల కూమార్తె వివాహాన్నీ జరిపించారు మల్లయ్య స్వామి.
ఇదీ చదవండి: 30 ఏళ్ల తర్వాత 28 పిల్లలకు జన్మనిచ్చిన మొసలి