ETV Bharat / bharat

ఎల్​జేపీ సంక్షోభం: పార్టీపై పట్టుకోల్పోయిన చిరాగ్​- నెక్ట్స్​ ఏంటి?

author img

By

Published : Jun 15, 2021, 11:06 PM IST

లోక్​ జనశక్తి పార్టీ రాజకీయాల్లో నీలినీడలు కమ్ముకుంటున్నాయి. పార్టీలోని ఐదుగురు ఎంపీలు తిరుగుబావుట ఎగురవేసి.. చిరాగ్​ పాసవాన్​ ఏకాకిని చేశారు. పార్టీలో రాజకీయ సంక్షోభానికి తెరలేపారు. పార్టీపై చిరాగ్ పాసవాన్ పట్టు కోల్పోయేలా చేశారు.. అయితే ఇప్పుడు పార్టీపై పెత్తనం ఎవరిది? బిహార్​లోని రాజకీయ ఎత్తుగడల ముందు చిరాగ్​ నిలుస్తారా? ఆయన​ ముందున్న మార్గాలేంటి?

Chirag
చిరాగ్​

ఎల్​జేపీలో ఏకాకిగా మిగిలిన చిరాగ్ పాసవాన్​​..

ఇటు పార్లమెంటరీ పక్షనేత పదవితో పాటు అధ్యక్ష పదవికి దూరమైన చిరాగ్​..

తండ్రి రాజకీయ వారసత్వాన్ని నిలబెడతారా?

రీల్​ లైఫ్​తో పాటు, రియల్​ లైఫ్​లోనూ విఫలమైన చిరాగ్​ ముందున్న దారులేంటి?

బిహార్​లో రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. ముఖ్యంగా లోక్​ జనశక్తి పార్టీ(ఎల్​జేపీ) రాజకీయ సంక్షోభంలోకి కూరుకుపోతోంది. ఆరుగురు ఎంపీలున్న ఈ పార్టీలో ఐదుగురు ఎంపీలు తిరుగుబావుట ఎగరవేసి.. చిరాగ్​ పాసవాన్​ ఏకాకిని చేశారు. పార్లమెంటరీ పార్టీ నేతగా తప్పించడమే కాకుండా పార్టీ అధ్యక్ష పదవి నుంచి తొలగిస్తూ తీర్మానం చేశారు. అంతే కాకుండా పార్టీ నూతన కార్యనిర్వాహక అధ్యక్షునిగా సూరజ్​​భాన్​ సింగ్​ను నియమించి.. పార్టీ జాతీయ అధ్యక్ష ఎన్నికల ప్రక్రియను కూడా ఆయనకు అప్పగించారు. చిరాగ్​కు స్వయనా బాబాయ్ వరుసైన పశుపతి కుమార్ పరాస్.. ఈ వ్యవహారాన్ని ముందుండి నడిపిస్తున్నారు. ఈ వ్యవహారాన్ని తేల్చుకోవడానికి చిరాగ్ నేరుగా పశుపతి​ ఇంటికి వెళ్లినా ఫలితం దక్కలేదు.

రాంవిలాస్ రాజకీయ వారసత్వాన్ని చిరాగ్​ నిలిపేనా?

రాంవిలాస్ పాసవాన్ మరణించి ఏడాది కాకముందే పార్టీలో విభేదాలు భగ్గుమన్నాయి. లోక్​సభలో 10 సీట్లు లేకపోయినా, కేంద్రంలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా.. రాంవిలాస్​కు మంత్రి పదవి పక్కా. అటువంటి వ్యూహాలు, రాజకీయ చతురతతో తనకు ఎదురులేదని నిరూపించుకున్నారు రాంవిలాస్.

చిరాగ్​ తప్పిదాలే పార్టీ విభేదాలకు కారణమా?

అయితే రాంవిలాస్ తదనంతరం పగ్గాలు చేపట్టిన చిరాగ్​.. ఆయన వారసత్వాన్ని నిలబెట్టాలని, పార్టీని ఏకతాటిపై నడిపించాలని శతవిధాల ప్రయత్నించారు. అందుకు తన వ్యూహాలతో భాజపాకు మద్దతు ఇస్తూ.. జేడీయూను కాదని రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో 136 స్థానాల్లో ఒంటరిగా బరిలోకి దిగారు. 2019 లోక్​సభ ఎన్నికల్లో మోదీ అండతో ఆరు స్థానాలను కైవసం చేసుకున్న ఎల్​జేపీ.. రాష్ట్ర ఎన్నికల్లో మాత్రం ఒక్క స్థానానికి పరిమితమై చతికిలపడింది.

భాజపా, జేడీయూలకు శత్రువుగా..

వేరుకుంపటి పెట్టి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసినందుకు జేడీయూకు, తన​ ప్రవర్తనతో ఇటు భాజపాకు విరోధిగా మారారు చిరాగ్​. అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఎల్​జేపీ మెజారిటీ స్థానాల్లో విజయం సాధించి.. జేడీయూను ఇరుకున పడేస్తుందన్న వార్తలు గట్టిగా వినిపించాయి. దీంతో సీఎం పదవిపై ఆశలు వదులుకున్న జేడీయూ నేత నితీశ్​ కుమార్​.. అప్పటికే చిరాగ్​ వైఖరిపై అసంతృప్తిగా ఉన్నారు. ఎలాగోలా సీఎం పీఠం అధిరోహించిన నితీశ్.. చిరాగ్​పై పగతీర్చుకోవాలని సంకల్పించుకున్నారు. ఈ క్రమంలోనే పశుపతి తిరుగుబావుట రూపంలో చిరాగ్​ పెద్ద ఎదురుదెబ్బ తగిలింది.

కుటుంబ సభ్యులకీ విరోధే!

తన రాజకీయ వ్యూహాలతో ఓ వెలుగు వెలుగిన రాంవిలాస్​ నుంచి వారసత్వం అందిపుచ్చున్నారు చిరాగ్. అయితే రాంవిలాస్​ అడుగుజాడల్లో నడవలేకపోయాడు. పార్టీ టిక్కెట్​ ఇవ్వడానికి చిరాగ్​ డబ్బులు డిమాండ్​ చేసినట్లు రాంవిలాస్​ పెద్ద అల్లుడు సాధు పాసవాన్​ ఆరోపించారు. అలాగే రాంవిలాస్​ మొదటి భార్యకు సంబంధించిన వివాదం కూడా తెరపైకి వచ్చింది. మరోవైపు పార్టీ వ్యూహాలతో ఎలాంటి సంబంధంలేని రాంవిలాస్​ ఇద్దరు తమ్ముళ్ల మాటలను చిరాగ్ లెక్కచేయలేదు.

ప్రజాస్వామ్య వ్యవస్థ, ప్రజా జీవితంలో నిర్వహించాల్సిన విలువలను చిరాగ్​ కాపాడలేకపోయారు. ఫలితంగా మొత్తం పార్టీ, కుటుంబ సభ్యుల ఆదరాభిమానాలకు దూరమయ్యారు.

చిరాగ్​ ముందున్న అవకాశాలేంటి?

ప్రస్తుత పరిస్థితుల్లో చిరాగ్​ కొత్త వ్యూహాలకు పదును పెట్టాల్సి ఉంటుంది. అయితే చిరాగ్​ ముందున్న ఎలాంటి అవకాశాలున్నాయి?

  1. ఎల్‌జేపీ పార్లమెంటరీ నేతను పార్టీ ఎంపీలు తొలగించడం రాజ్యాంగ విరుద్ధమని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు ఫిర్యాదు చేయడం. అయితే, ఈ విషయంలో అతనికి పెద్ద ఊరట లభించకపోవచ్చు.
  2. చిరాగ్​ ఎన్నికల సంఘాన్ని సంప్రదించవచ్చు. కానీ ఆయనకు అక్కడ కూడా పెద్ద ఉపశమనం కలగపోవచ్చని రాజకీయ నిపుణులు చెబుతున్నారు.
  3. రాజకీయ స్థిరత్వం కోసం ఇతర పార్టీలతో పొత్తు కుదుర్చుకోవచ్చు.
  4. బిహార్‌లోని తేజస్వీ యాదవ్​, చిరాగ్ మధ్య పొత్తు కుదుర్చుకునే అవకాశం ఉంది. చిరాగ్​కు ఉన్న అన్ని మార్గాల్లోకెళ్లా.. ఆర్​జేడీతో పొత్తు కుదుర్చుకోవడమే ఉత్తమం. ఇలా చేస్తే.. పశుపతితో పాటు సీఎం నితీశ్​ కుమార్‌కు వ్యతిరేకంగా తన నిరసన గొంతును గట్టిగా వినిపించవచ్చు.

పాసవాన్​ బంధువుల చేతిలోనే పార్టీ

చిరాగ్ చేతిలో నుంచి పార్టీ జారిపోయిన తర్వాత పశుపతి కుమార్​ ఎల్​జేపీకి కీలక నేతగా మారారు. ఇప్పటికీ ఎల్‌జేపీ.. రాంవిలాస్​ బంధువుల చేతిలోనే ఉంది. అయితే తన తండ్రి వారసత్వాన్ని కాపాడుకోవడానికి, పార్టీని సంక్షోభం నుంచి బయట పడేయడానికి చిరాగ్​ ఎలాంటి ఎత్తులు వేస్తారో చూడాలి.

ఇదీ చూడండి:

చిరాగ్ ఏకాకి- దెబ్బకుదెబ్బ తీసిన నితీశ్!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.